కరోనా కష్టకాలంలో సినీ పరిశ్రమలో నిరుపేద కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ సినీనటుడు జీవన్ కుమార్ ముందుకొచ్చారు. తెలుగు దర్శకులు, రచయితలు, నటీనటుల సంఘంలోని 300 మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
ప్రముఖ దర్శకుడు, నటుడు విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరై జీవన్ కుమార్ చేస్తున్న కృషిని అభినందించారు. కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉన్న వేళ నిస్సహాయులను ఆదుకుంటున్న జీవన్ కుమార్ బృందాన్ని కూడా… ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని విశ్వనాథ్ కోరారు. నటుడిగా ఆదరిస్తున్న సినీ పరిశ్రమకు తన వంతు సహాయం అందిస్తున్నానని పేర్కొన్న జీవన్ కుమార్... తన సహాయం వెనుకున్న కథానాయకులు సాయితేజ్, నవీన్, తరుణ్ భాస్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: Rape Case: మైనర్పై రేప్.. ప్రముఖ టీవీ నటుడు అరెస్టు