ETV Bharat / sitara

పోరాటానికి సిద్ధమవుతున్న బుల్లితెర - 50th anniversary of Telugu TV industry

కోట్లాది మంది ప్రేక్షకులకు 24 గంటలపాటు వినోదాన్ని అందిస్తోన్న బుల్లితెర పోరుబాట పట్టింది. తమ హక్కుల సాధన కోసం చిత్రీకరణలకు నిలిపివేసి ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. తెలుగు టెలివిజన్‌ను సినీ పరిశ్రమతో సమానంగా పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 14న భారీ సభను నిర్వహించబోతోంది. తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్, వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో నివేదన సభ పేరుతో జరిగే కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తమ డిమాండ్లను వినిపించబోతుంది. తెలుగు టెలివిజన్ ఆవిర్భవించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా టీవీ కార్మికులంతా ఏకమై తమ సమస్యలను ఏకరవు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

telugu tv industry protest in telangana on February 14th
తెలుగు టీవీ పరిశ్రమ పోరుబాట
author img

By

Published : Feb 12, 2021, 9:34 AM IST

నిరంతరం వినోదాన్ని పంచుతూ ఇంటిల్లిపాదిని అలరించే బుల్లితెర చిన్నబోతుంది. ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు 24 గంటలు శ్రమిస్తున్నా... పాలకులెవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంవత్సరాల నుంచి పోరాడుతున్నా.... ధారావాహికలా తమపోరు కొనసాగుతుందే తప్ప ప్రయోజం లేదని తెలుగు టెలివిజన్ సంఘాలు వాపోతున్నాయి. తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఆవిర్భవించి 50 ఏళ్లవుతున్న వేడుక వేదికగానే తమ గళం గట్టిగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14న నివేదన సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఎదుర్కొంటోన్న సవాళ్లు, కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించబోతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 14న అన్నిరకాల చిత్రీకరణలకు సెలవు ప్రకటించినట్లు టెలివిజన్ సంఘాలు స్పష్టం చేశాయి.

తెలుగు టీవీ పరిశ్రమ పోరుబాట

కష్టంగా ఉంటోంది..

49 ఏళ్ల కిందట... దూరదర్శన్‌లో కేవలం 16 మందితో ప్రారంభమైన తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది. నిత్యం రకరకాల వినోద, విజ్ఞాన కార్యక్రమాలతోపాటు రియాల్టీ షోలు, ధారావాహికలను అందిస్తూ ప్రేక్షకులను రంజింపచేస్తుంది. కృష్ణానగర్, వెంకటగిరి, మధురానగర్ సహా చట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగురాష్ట్రాల నుంచి వచ్చి అద్దె ఇళ్లల్లో నివసిస్తూ అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతిభ చాటుకుంటున్నారు. తెరవెనక రేయింబవళ్లు కష్టపడుతున్న శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదని పలువురు కార్మికులు వాపోతున్నారు. సరైన భద్రత లేకపోవడం, అంతంతమాత్రంగానే వచ్చే జీతం డబ్బులతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టంగా మారుతోందని ఆందోళన చెందుతున్నారు.

పని కోసం వెతకాల్సిందే..

తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఒక్కోరోజు 75కుపైగా ధారావాహికల చిత్రీకరణ జరుగుతుంది. ఒక్కో ఎపిసోడ్‌కు 60 నుంచి 80 మంది శ్రమిస్తుంటారు. వారిలో కొంతమందికి రోజువారీ భత్యం లభిస్తుండగా మరికొంత మందికి మూడు నెలలకోసారి వేతనం అందుతుంటుంది. నెలలో 15 రోజులే పని ఉండగా... మిగతా రోజులు పనికోసం వెతుక్కోవాల్సిన దుస్థితి వారిది . అనారోగ్యానికి గురైనా, అనుకోకుండా ప్రమాదం జరిగినా ఆ కుటుంబాలు పడే వర్ణణాతీతం.

సాయం లేదు

సినీ పరిశ్రమకు అందిస్తున్న సంక్షేమ పథకాలను టీవీ కార్మికులకూ వర్తింపజేయాలని వేడుకుంటున్నారు. బుల్లితెర పరిశ్రమలో ఏడాదికి సుమారు 8వేల కోట్ల వ్యాపారం జరుగుతుండగా... సర్వీస్ టాక్స్, టీడీఎస్, జీఎస్టీల రూపంలో ఏటా ప్రభుత్వానికి 1800 కోట్లు చెల్లిస్తున్నారు. టెలివిజన్ పరిశ్రమ సంక్షేమానికి ప్రభుత్వాలు ఆ రీతిలో ఖర్చు చేయడంలేదని కళాకారులు వాపోతున్నారు.

టీవీ నగర్

కార్మికుల సంక్షేమం కోసం చిత్రపురి తరహాలోనే టీవీ నగర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేషన్ కార్డులు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని, ఎఫ్​డీసీ నుంచి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ సభకు టీవీ, సినీ నిర్మాతల మండలి నుంచీ మద్దతు లభించడం పట్ల టెలివిజన్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.