ETV Bharat / sitara

ఆ సమయంలో సూసైడ్​కు యత్నించిన రాకింగ్​ రాకేశ్! - అదిరే అభి

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట ప్రముఖ కమీడియన్ రాకింగ్ రాకేశ్. ఎందుకు చేసుకోవాలనుకున్నాడు? అందుకు కారణం ఏంటో ఇటీవలే శ్రీ దేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్​లో తెలిపాడు.

Rocking Rakesh
రాకింగ్ రాకేశ్
author img

By

Published : Sep 1, 2021, 2:36 PM IST

వృత్తి జీవితంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకొని నిలబడటానికి, కుంగుబాటులో ధైర్యం చెప్పడానికి మనకు ఎల్లవేళలా ఓ గురువు లాంటి వ్యక్తి ఉంటారు. అలా తను ఆత్మహత్యకు యత్నించిన సమయంలో చలాకీ చంటి కొండంత అండగా నిలబడి ఆదుకున్నట్లు చెప్పాడు జబర్దస్త్​ నటుడు రాకింగ్ రాకేశ్. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో గురుపూజోత్సవం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"జబర్దస్త్​లో టీమ్​ లీడర్​గా నిలదొక్కుకోవడం అంటే మాములు విషయం కాదు. ఒక టైంలో టీమ్​ లీడర్​గా నన్ను తీసేశారు. ఆ సమయంలో డిప్రెషన్​లోకి వెళ్లాడు. సూసైడ్​కూ యత్నించాను. కారును చెట్టుకు కావాలని గుద్దేశాను. నన్ను సారథిగా తీసేసిన సమయంలో తన టీమ్​లో పెట్టుకొని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది చంటి అన్న. మళ్లీ ఈరోజు టీమ్​లీడర్​గా నిల్చున్నాను అందుకు కారణం చంటి అన్నే"

-రాకింగ్ రాకేశ్, హాస్య నటుడు

సెప్టెంబర్ 5న ప్రసారమయ్యే ఈ కార్యక్రమం గురువులకు నివాళి ఇచ్చేవిధంగా, ఆద్యంతం అలరిస్తూ ఉండనుందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇక హైపర్​ ఆది కూడా తన గురువు అదిరే అభి తనకు దేవుడి లాంటివాడని చెప్పాడు. ఆ తర్వాత ఇంద్రజ చేసిన పర్ఫామెన్స్​ షోకే హైలెట్​గా నిలిచేలా ఉంది.

ఇదీ చూడండి: Alitho Saradaga: 'ఈ విషయం ఇంద్రజకు కూడా తెలియదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.