ఇటీవల మరణించిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' నివాళి అర్పించింది. వచ్చే ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌ను ఆయనకు అంకితమిచ్చింది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాథ శరణాలయాలు, 1800 మందికి ఉచితంగా విద్యనందిస్తూ ప్రజల మనసుల్లో పునీత్ నిలిచిపోయారు.
ఈ ప్రోమోలో భాగంగా గెటప్ శీను, రాంప్రసాద్, రాఘవల పిల్లలు వచ్చి 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో సందడి చేశారు. వీరితో పాటు చిన్నారి సింగర్స్, యాక్టర్స్ కూడా విచ్చేసి తమదైన ఎంటర్టైన్మెంట్ అందించారు. 'పిల్లల సందడి' పేరుతో రాబోయే ఈ ఎపిసోడ్.. నవంబరు 14న పిల్లల దినోత్సవం సందర్భంగా ఈటీవీలో మధ్యాహ్నం ప్రసారమవుతుంది. ఈ షోకు ఇంద్రజతో పాటు అలనాటి యాంకర్ ఉదయభాను కూడా విచ్చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: