బుల్లితెర ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే కార్యక్రమాల్లో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి. ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మే 23న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఆదివారం విడుదలైంది.
ఈ ఎపిసోడ్‌లో వెండితెర నటులు పృథ్వీరాజ్, హేమ అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. పృథ్వీకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన డైలాగ్ అమ్మ దానమ్మ బత్తాయో. ఈ పేరుతో ఓ సినిమా రూపొందించి, ఆ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకలో హైపర్ ఆది పంచ్‌లు నవ్వులు పూయిస్తున్నాయి. హాస్యం అంటూ హేమ, పృథ్వీ పలికే హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు కరోనాను తేలికగా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించి ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తున్నాడు రాంప్రసాద్. కొవిడ్‌ను లైట్ తీసుకుని కన్న కూతురిని పోగొట్టుకున్న వ్యక్తి కథను ఆవిష్కరించి హృదయాలను కదిలిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">