బుల్లితెర ప్రేక్షకులకు(Sridevi drama company latest episode) మంచి వినోదం పంచే కార్యక్రమాల్లో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి. సుధీర్ వ్యాఖ్యాతగా ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. నవంబరు 7న ప్రసారం కానున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలై ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను(sridevi drama company contestants) చేసిన 'అతడు' కామెడీ స్ఫూఫ్ కడుపుబ్బా నవ్విస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'జీన్స్' సినిమాలోని 'కన్నులతో చూసేది గురువా' పాటను జడ్జి ఇంద్రజ(sri devidrama company judge) అద్భుతంగా ఆలపించడం ఎపిసోడ్కు హైలెట్గా నిలిచింది. నవంబరు 7న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను ప్రశంసిస్తూ ఓ ప్రత్యేక గీతానికి డ్యాన్స్ వేశారు. ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు కంటెస్టెంట్లు.
ఇదీ చూడండి: వర్ష రొమాంటిక్ డ్యాన్స్.. ఇమ్మాన్యుయేల్ అయితే..!