ETV Bharat / sitara

'ఆ ప్రశంస ప్రత్యేకం.. ఎప్పటికీ మర్చిపోలేను'

author img

By

Published : Aug 14, 2021, 9:15 AM IST

'నా పేరు మీనాక్షి'.. సీరియళ్లు చూసే పెద్దవారి నుంచి చిన్న పిల్లలకూ సుపరిచితమైన పేరు. పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ నటి.. ప్రతి తెలుగువారి గుండెళ్లో మంచి స్థానం సంపాదించుకుంది. అయితే ఇప్పుడు మాతృ భాష కన్నడ కన్నా తెలుగులోనే తన మాటలు ఎక్కువగా దొర్లుతున్నాయని చెబుతోంది. అసలు పేరు నవ్యస్వామి అయినా.. మీనాక్షిగానే చెరగని ముద్రవేస్తోంది.

Navya Swamy
నవ్యస్వామి

పుట్టి పెరిగింది కర్ణాటక. తెలియని భాషలో అడుగుపెట్టినా.. అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. మాట నుంచి చీరకట్టు వరకు అన్నీ నేర్చుకుంది. కన్నడలో మాట్లాడుతున్నా మధ్యలో తెలుగు పదాలే వచ్చేస్తాయ్‌! అంతలా తెలుగమ్మాయిలా మారిపోయింది. 'నా పేరు మీనాక్షి'లో కథానాయిక నవ్యస్వామి గురించే ఇదంతా! వసుంధరతో తను బోలెడు విశేషాలను పంచుకుంది..

Navya Swamy
నవ్యస్వామి

పుట్టి, పెరిగింది మైసూరు. చదివిందేమో బెంగళూరు. నాన్న పుట్టస్వామి రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి, అమ్మ సరస్వతి గృహిణి, అన్న వినయ్‌ వ్యాపారం చేస్తున్నాడు. వదిన ఐశ్వర్య కూడా సీరియళ్లలో చేస్తుంది.

అలా మొదలైంది.. తెలుగులోకొచ్చి ఎనిమిదేళ్లు. ఇంటర్‌ సెలవుల్లో టీవీ యాంకర్‌ కావాలన్న ప్రకటన చూసి ప్రయత్నిస్తే ఎంపికయ్యా. చదువుకీ ప్రాధాన్యం ఇవ్వాలన్న నాన్న మాటతో యాంకరింగ్‌ చేస్తూనే బీబీఎం పూర్తి చేశా. కన్నడంలో ఓ సినిమా కూడా చేశా. తర్వాత ధారావాహికలు. అలా.. కన్నడ, తమిళం.. తర్వాత తెలుగుకొచ్చా.

Navya Swamy
'నా పేరు మీనాక్షి' పోస్టర్

నిత్యం నేర్చుకుంటా.. ఇక్కడ నా మొదటి సీరియల్‌ 'ఆహ్వానం'. తర్వాత 'నా పేరు మీనాక్షి'తో మంచి గుర్తింపొచ్చింది. చిన్నప్పటి నుంచి సినిమాలు, నటులు ఇష్టమే కానీ ఈ రంగంలోకి రావాలన్న ప్రత్యేక కోరికేమీ లేదు. స్కూలు, కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడమే తప్ప ప్రత్యేకంగా నటనని నేర్చుకోలేదు. ఓ తమిళ సీరియల్‌లో రాధికా శరత్‌ కుమార్‌తో కలిసి పని చేశా. దాంట్లో తండ్రి చనిపోయినపుడు ఏడ్చే సీన్‌ చూసి ప్రశంసించారు. ఆమె త్వరగా ఎవరినీ మెచ్చుకోరట. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకం. షూటింగులకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొంత మంది ఎంతో దూరం ప్రయాణించి మరీ వస్తారు కలవడానికి. చాలామంది మెసేజ్‌లూ పెడుతుంటారు. ఇవన్నీ చూసినపుడు చాలా ఆనందమేస్తుంది. అందుకే నన్ను నేను మెరుగుపరచుకుంటూ ఉంటా. నేను చేసిన సీన్లను చూసుకుని మార్చుకోవాల్సినవి నోట్‌ చేసుకుంటా. మా అమ్మ నా విమర్శకురాలు. మంచి సలహాలూ ఇస్తుంటుంది. అవన్నీ పాటిస్తా. ఆడవాళ్లు ఎక్కువగా నా డ్రెసింగ్‌ బాగుందంటారు. మాది మధ్యతరగతి కుటుంబం. ఫ్యాషన్‌, మేకప్‌ల గురించి ఇంతకు ముందు పెద్దగా తెలీదు. అందరినీ గమనిస్తూ మెరుగుపరచుకున్నా.

Navya Swamy
నటి నవ్యస్వామి

అల్లరి పిల్లనే..! ఇంటర్‌ అమ్మాయిల కాలేజ్‌లో చదివా. మాస్‌ బంక్‌, స్నేహితులతో సినిమాలూ మామూలే. ఇంట్లో తెలిసి తిట్లూ తినేదాన్ని. ఓసారి స్నేహితులందరం కాఫీడేలో కలుద్దాం అనుకున్నాం. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల బండి తీసుకెళ్లా. వచ్చేటపుడు యాక్సిడెంట్‌ అయింది. ఫ్రెండ్స్‌, తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులు పోగు చేసి, రిపేర్‌ చేయించేశా. అయినా గుర్తు పట్టేసి బాగా కోప్పడ్డారు.

ఖాళీ దొరికితే.. షాపింగ్‌ చేస్తా. అన్ని భాషల సినిమాలూ చూస్తా. వంట చేస్తా. ఇల్లు శుభ్రం చేయడం, సర్దుకోవడం నాకో వ్యసనం. స్వీట్స్‌, చాక్‌లెట్లు, ఐస్‌క్రీమ్‌ లాగించేస్తా. అందుకు తగ్గట్టుగా వ్యాయామమూ చేస్తాననుకోండి.

Navya Swamy
'నా పేరు మీనాక్షి'లో నవ్య

తిరిగొస్తుంది.. సరదాలే కాదు, జీవితాన్నీ సీరియస్‌గా తీసుకుంటా. ఏదీ సులువుగా రాదని నా నమ్మకం. నాన్న ఓ మాట చెప్పే వారు.. 'ఏది చేస్తే అదే తిరిగొస్తుందని' మైసూరులో దసరా సమయంలో ఏటా ఎగ్జిబిషన్‌ పెడతారు. ఓసారి దాంట్లో సెంటెడ్‌ ఎరేజర్‌లు జేబులో వేసుకొచ్చేశా. నాన్నకి గొప్పగా చూపించా. 'నువ్విప్పుడు ఇలా తీశావ్‌ కదా! చూడు.. నీవీ పోతాయి' అన్నారు. నిజంగానే నా వస్తువులు కొన్ని పోయాయి. అప్పట్నుంచి మంచి చేస్తే అదే తిరిగొస్తుందని బాగా నమ్ముతా, పాటిస్తా.

తెలుగమ్మాయినైపోయా! నాది సూటిగా మాట్లాడే మనస్తత్వం. నావాళ్లు అనుకుంటే ఏదైనా చేస్తా. ఆ మధ్య కొవిడ్‌ వల్ల చాలా ఇబ్బందిపడ్డా. ఆ సమయంలో కొన్ని విషయాలు జీవితంలో ఎప్పుడూ లేనంతగా బాధపెట్టాయి. కానీ త్వరగానే బయటపడ్డా. నా అదృష్టమో ఏమో కానీ పరిశ్రమలో ఇబ్బందులేమీ పడలేదు. అందరం ఒక కుటుంబంలా ఉంటాం. అందుకే మొదట్లో నాతోపాటే ఉండే అమ్మ ఇప్పుడు అప్పుడప్పుడూ మాత్రమే వస్తోంది. హరితేజ ఇక్కడ మంచి స్నేహితురాలు. బెంగళూరులో ఎలా సౌకర్యవంతంగా ఉంటానో ఇక్కడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు కన్నడ మాట్లాడినా అందులో తెలుగు పదాలే దొర్లుతుంటాయి. మా దగ్గరా చేసినా ఇక్కడి ఉగాది పచ్చడే నా ఫేవరెట్‌. తెలుగు సినిమాల్లో అవకాశాలూ వస్తున్నాయి. ప్రాధాన్యమున్న పాత్ర దొరికితే చేస్తా.

ఇదీ చూడండి: 17 ఏళ్లకే ఇంట్లోంచి వెళ్లిపోయా: శ్రీవాణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.