ETV Bharat / sitara

SP Balu: బాలు ఎదలోతుల జ్ఞాపకాల సమాహారం 'స్వరాభిషేకం'

author img

By

Published : Jun 4, 2021, 7:00 AM IST

తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద పండుగ 'స్వరాభిషేకం'. సంగీత ఆరాధనోత్సవం. సంగీత, సాహిత్య సమలంకృతంగా, తెలుగు సినీ సంగీత సంగతుల ఆవిష్కరణగా విరసిల్లిన సుమధుర కార్యక్రమం స్వరాభిషేకం. రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుగారి మానసపుత్రిక ఈ కార్యక్రమం. సమయానికి తగుమాటలాడే సత్కార, ప్రశంసాతోరణం. హృద్యమైన అభిభాషణం. రవళించే జ్ఞాపకాల జావళి.

SP Balu Attachment with ETV Swarabhishekam Program
ఎస్పీ బాలు

ప్రతిభ ఉండీ, రాగాలు నేర్చుకునే శక్తిలేక జీవనరాగంతో రాజీపడిన అనేక నవయువ స్వరాలను బాలు తట్టిలేపారు. సీహెచ్ రామోజీరావు నిర్మించిన ఈటీవీ 'పాడాలని ఉంది' ద్వారా బాల, యువ స్వరాలను వెలుగులోకి తీసుకొచ్చారు. తర్వాత ఆయన ఆశీస్సులతో ఇదే క్రమంలో 'స్వరాభిషేకం' కార్యక్రమం తీసుకొచ్చారు. గాయకులు బోయీలుగా పాటలు పల్లకీలో విహరించే అపురూప కార్యక్రమం. దక్షిణ భారత టెలివిజన్ చరిత్రలో సువర్ణాధ్యాయం స్వరాభిషేకం. ఆ కార్యక్రమం ఎంతో ఆహ్లాదంగా, అలసిన మనసులకు సంగీత లేపనంగా రూపుదిద్దుకుంది. తెలుగుసినిమా పాటతో ఎన్నెన్నో జన్మల రాగబంధం ఉన్న శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మార్గదర్శనంలో స్వరాభిషేకం ప్రేక్షకలోకాన్ని మైమరిపించింది. స్వరాభిషేకంలో మంత్రపుష్పాలలా జ్ఞాపకాల చర్చ చందన చర్చితమౌతుంటే అందరూ మంత్రముగ్ధులై ఆస్వాదిస్తుంటారు. అతడి మాటలకు ఎదలోతుల్లో జ్ఞాపకాలన్నీ పొరలు చీల్చుకుని కన్నీటి తెరలుగా ఉబికి ఉబికి వస్తాయి. సినీబంధువులంతా ఆ జ్ఞాపకాల చలమలోకి, ఆ అనుభవాల కాసారంలోకి తొంగి చూసుకుని తమను తాము ‘గుర్తించు’కుంటారు. కలకాలం గుర్తుంచుకుంటారు.

SP Balu Attachment with ETV Swarabhishekam Program
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

సంగీత వాద్య బృందంలో ఏఏ కళాకారుడు ఏఏ పరికరంతో సహకరిస్తున్నాడో జ్ఞాపకం ఉంచుకుంటారు బాలు. సంగీత, సాహిత్య సమలంకృతం. అంతరంగాలలోని మధుర స్మృతుల ఆవిష్కరణకు అవార్డులు ఇస్తే ప్రథమ పురస్కారం ఆయనకే దక్కుతుంది. బాల సుబ్రహ్మణ్యం మెదడు పెద్ద మెమొరీ కార్డు. వేలవేల గిగాబైట్ల జ్ఞాన భాండాగారం. అతడితో సంభాషించడం అంటే తెలుగు సినిమా కనీస ఐదున్నర దశాబ్దాలు తన జ్ఞాపకాలను, వ్యాపకాలను నెమరువేసుకోవటమే అయ్యింది. దశాబ్దాల సంగీతయాత్ర గురించి వివరించే సందర్భంలో.. ఆ మాటకచేరీలో, ఆ పాటకచేరీలో అతడి స్మృతిపథాన్ని తాకని మనిషి ఉండడు. తెలుగు తెలియని దర్శకులు, తెలుగు రాని గాయకులతో పాడించి నవ్యత పేరుతో మాతృభాషకు తీరని ద్రోహం చేస్తున్నారని బాలసుబ్రహ్మణ్యం బాధపడేవారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'స్వరాభిషేకం' పాటల పల్లకీకి పచ్చకల్యాణం. సంగీతానికి నిత్యఆరాధనోత్సవం. ఎన్నో వసంత వేళలు వచ్చి పోతున్నా ఈ కార్యక్రమం సంవత్సరాలుగా విజయవంతంగా అనేక తరాలను, స్వరాలను గౌరవించే విశిష్ట, ఉదాత్త కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ఆ కార్యక్రమం సుసంపన్నం కావటంలో ఖ్యాతి, ప్రయోక్త ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యాంకర్ సుమలకు దక్కుతుంది. ఈటీవీ 20 ఏళ్ల వేడుకల సందర్భంలో సినీ దిగ్గజాల సమక్షంలో ప్రవహించిన పాటలు కలకాలం గుర్తుండిపోతాయి. మధురస్మృతులలా మదిలో నిలిచిపోతాయి. ఎందరో మహానుభావుల సమక్షంలో అందరినీ తల్చుకుంటూ.. వారందరూ తనజోలెలో కొన్ని పాటలు వేయడం వల్లనే తానింతటి స్థాయికి వచ్చానని సదా సదా.. సర్వదా చాటుకునే వినయ సంపన్నుడు. సినీగానంలో శిఖరసమానుడు. జ్ఞాపకాలతో కడిగేస్తుంటే చెమ్మగిల్లని కళ్లు ఉంటాయా? ఓ కవి అన్నట్లు కాలికి తడి అంటకుండా సముద్రాలు దాటవచ్చు. కానీ కంటికి తడి అంటకుండా జీవితాన్ని దాటలేరు. జీవితంలో మనం ఇన్ని మంచిపనులు చేశాం. ఇంత ఉపాకరం చేశాం అని ఆత్మ సంతృప్తితో సమీక్షించుకునే సందర్భాలకంటే విలువైన క్షణాలేముంటాయి?

బాలసుబ్రహ్మణ్యం అర్ధశతాబ్దానికి పైగా తెలుగు సినీ నేపథ్య గానాన్ని రాగరంజితం చేస్తూ వచ్చారు. సంగీతంతో, సినీనేపథ్య గానంతో ఆయనది ఎన్నెన్నో జన్మల బంధం. అది ఎన్నటికీ వీడని రాగబంధం. పరిమళ గంధం. గంధర్వులే ఆవహించారేమో. ఆయన గానంతో మధుర తుషారాలు మనసు తాకాయి. మధువనాలు మళ్లీ పూస్తుంటాయి. బాలు గళం చ‌లువ పందిరి కింద కొత్త తాటాకు సుగంధం. మాఘ‌మాసంలో నారింజ‌ ప‌రిమ‌ళం. అందులో తేనె వాగులు, మేలిముత్యాలు, వెన్నెల సోన‌లు వుంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.