ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం భారత్‌లోనూ కొనసాగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమవంతు సాయం చేస్తున్నారు. ముఖ్యంగా సినీతారలు కరోనాపై జరిగే పోరాటంలో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఇటీవల అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అగ్ర నటులు 'ఫ్యామిలీ' అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించారు. ప్రసూన్ పాండే దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు విశేష ఆదరణ లభించింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని బుల్లితెర నటులందరూ కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. వీరంతా తమ ఇంట్లో ఉంటూనే ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించడం మరో విశేషం.
ఇందులో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణలతో పాటు, టెలివిజన్ నటులు యమున, జయలలిత, హరిత, శుభలేఖ సుధాకర్, ప్రభాకర్, సమీర్, జాకీ, అర్చన, రాజశ్రీ, ప్రవీణ్, కౌశిక్, నిరుపమ్, సాయికిరణ్, యాంకర్ రవి, అలీ రెజా, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, వీజే సన్నీ, విశ్వ, కృష్ణ కిషోర్, సుధీర్, బాలాదిత్య, సుజిత, అస్మిత, మంజుల, రోహిణి, ఆశిక, అన్షురెడ్డి, సుష్మ కిరణ్, మధురెడ్డి, ప్రియాంకలు నటించారు. 34మంది దక్షిణాది నటీనటులు 29మంది ఇళ్లలో 29 మొబైల్ కెమెరాలతో చిత్రీకరించారు. రవికిరణ్ ఈ షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించాడు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రస్తుతం ఈవీడియో వైరల్ అవుతోంది. మరి మన బుల్లితెర నటులు ఏం చేశారో మీరూ చూసేయండి.
ఇదీ చూడండి.. ఒకే ఇంట్లో అమితాబ్-రజనీకాంత్-చిరంజీవి?