ETV Bharat / sitara

ఆ హీరోయిన్​ నవ్వుకు స్టేట్ అవార్డు - అలీతో సరదాగాలో స్నేహ

ఆ కథానాయిక నవ్వితే అబ్బ భలే అందంగా ఉంది కదరా! అని మనం అనుకుంటాం. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏకంగా 'బెస్ట్ స్మైల్ అవార్డు' ఇచ్చి ఆమెను సత్కరించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?

sneha
స్నేహ
author img

By

Published : Sep 22, 2021, 2:41 PM IST

ఎక్కడైనా నటనకు, ప్రతిభకు అవార్డులు ఇస్తారు. కానీ.. చిరునవ్వుకు అవార్డు ఇస్తారా? అవును.. తన నవ్వుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని సీనియర్ నటి స్నేహ చెప్పారు. చిన్నప్పుడు క్లాస్​రూంలో స్నాక్స్​, కోక్ తీసుకుంటూ పాఠాలు వినేదాన్నని అన్నారు. ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా వచ్చిన స్నేహ.. తన జీవితంలోని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఒక్కోసారి వ్యక్తులు గుర్తుంటారు.. కానీ పేర్లు గుర్తుండవని అన్నారు. 'ప్రియమైన నీకు' చిత్రంలో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టానని తెలిపారు.

sneha
నటి స్నేహ

శ్రీరామదాసు సినిమాలో హీరోయిన్​ పాత్ర చేసేందుకు చాలా కష్టపడ్డానని స్నేహ అన్నారు. నటి సౌందర్యకు పెద్ద అభిమానినని చెప్పారు. సౌందర్య మరణవార్త విని షాక్​కు గురయ్యానన్నారు. ఓసారి కారులో తన కుటుంబంతో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందనే విషయాన్ని వెల్లడించారు. నెల రోజుల పాటు బెడ్​రెస్ట్​ తీసుకున్నానని చెప్పారు.

sneha
సీనియర్ నటి స్నేహ

ప్రియమైన నీకు తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమని పేర్కొన్నారు. వినయ విధేయ రామ.. తనకు బ్యూటిఫుల్ కమ్​బ్యాక్ చిత్రమని చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: వెంకటేశ్ షాకింగ్ లుక్.. రానాతో కలిసి వెబ్ సిరీస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.