ETV Bharat / sitara

Tollywood News: షూటింగ్​ సందడి ఎప్పుడో?

దేశంలో కరోనా(Corona) కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. మహారాష్ట్రలో కొవిడ్​ ఉద్ధృతి(Covid cases in MH) తగ్గుముఖం పడుతుండటం వల్ల ఆ రాష్ట్రంలో థియేటర్లను తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో పాటు టాలీవుడ్​లోనూ కార్యకలాపాల పునరుద్ధరణకు రంగం సిద్ధం అవుతుంది.

Shootings to be resume in tollywood?
Tollywood News: షూటింగ్​ సందడి ఎప్పుడో?
author img

By

Published : Jun 6, 2021, 7:20 AM IST

నిలిచిపోయిన సినిమా చిత్రీకరణలు షురూ కానున్నాయి. మూతపడిన థియేటర్లు క్రమంగా తెరుచుకోనున్నాయి. రాష్ట్రాల వారీగా సినిమా సందడి మెల్లమెల్లగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు చిత్రసీమ(Tollywood) కార్యకలాపాల పునరుద్ధరణకు రంగం సిద్ధం చేసుకొంటోంది. కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతుండటం వల్ల రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపులు ఇస్తున్నాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య(Covid cases in MH) ఆధారంగా ఆయా ప్రాంతాల్ని స్థాయిలవారీగా విభజించి లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఎత్తివేసింది. పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. అక్కడ థియేటర్లలో సినిమా ప్రదర్శనలకూ అనుమతులు ఇచ్చింది. దాంతో చివరి దశలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయడం కోసం ఈ నెల 7 నుంచే బాలీవుడ్‌ వర్గాలు చిత్రీకరణలకు సిద్ధం అవుతున్నాయి.

టైగర్‌ష్రాఫ్‌ 'టైగర్‌ 3' మొదలుకొని షారుఖ్‌ఖాన్‌ 'పఠాన్‌'(pathan), అజయ్‌ దేవగణ్‌ 'మే డే'(May Day), సంజయ్‌ లీలా భన్సాలీ 'గంగూబాయి కతియావాడి'(gangubai kathiawadi).. రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ల 'బ్రహ్మాస్త్ర'(Brahmastra), ప్రభాస్‌ 'ఆదిపురుష్‌'(Adipurush) తదితరాలు చిత్రీకరణ దశలోనే ఆగిపోయాయి. వాటని పునరుద్ధరించేందుకు బాలీవుడ్‌(Bollywood) వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. అయితే నిబంధనల దృష్ట్యా అన్ని సినిమాల చిత్రీకరణలు ఇప్పట్లో ప్రారంభం కాలేవని, నిర్మాతలు తమ చిత్రబృందాలకు టీకాలు వేయించడంపై దృష్టిపెట్టారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

టాలీవుడ్‌ రెడీ

తెలుగు చిత్రసీమలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలోనూ కొన్ని సినిమాల చిత్రీకరణలు సాగాయి. లాక్‌డౌన్‌ తర్వాతే పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణల్ని పునః ప్రారంభించేందుకు పలు చిత్రబృందాలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలకు సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. సమంత ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న 'శాకుంతలం'(sakunthalam) సినిమా సెట్‌ పనులు మొదలయ్యాయి.

'పుష్ప'(Pushpa) చిత్రీకరణ ఈ నెలాఖరులోనే మళ్లీ షురూ కానుంది. ఆ మేరకు చిత్రబృందం ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది. చాలా సినిమాలు చివరి దశలో ఉన్నాయి. అవన్నీ త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన 'రాధేశ్యామ్‌'(Radhe Shyam) పది రోజులు చిత్రీకరణను పూర్తి చేసుకుంటే పూర్తవుతుంది. 'ఆచార్య'(Acharya) మరో 20 రోజులు షూటింగ్‌ చేస్తే పూర్తవుతుంది. ఇలా చాలా చివరి దశలో ఉన్న సినిమాలు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా మారినా వెంటనే పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

థియేటర్లు ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇక్కడ లాక్‌డౌన్‌(Lock Down)కు ముందే చాలా థియేటర్లు మూతపడ్డాయి. ప్రేక్షకుల రాక తగ్గిపోవడం, కొత్త సినిమాల విడుదలలు ఆగి పోవడం వల్ల థియేటర్‌ యాజమాన్యాలు స్వచ్ఛందంగా తలుపులు వేశాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కొత్త సినిమాలు విడుదల కాకపోతే థియేటర్లు ఇప్పట్లో తెరచుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

ప్రేక్షకులు భయాల్ని వదిలి థియేటర్లకు రావడానికి సిద్ధమైనప్పుడే నిర్మాతలు చిత్రాల్ని విడుదల చేయడానికి మొగ్గు చూపుతారు. 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో(50 seating capacity rule) జులై, ఆగస్టులో తెరుచుకున్నా.. తెలుగు రాష్ట్రాల్లో దసరా నుంచి కానీ థియేటర్ల దగ్గర పూర్తి సందడి ఊపందుకునే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. "మన దగ్గర వ్యాక్సిన్‌ ప్రక్రియ ఇప్పుడే ఊపందుకుంది. ఇది 50శాతమైనా పూర్తైతే ప్రజల్లో ధైర్యం వస్తుంది. అప్పుడు వారు థియేటర్లకు రావడానికి వెనుకాడరు" అని ఓ డిస్ట్రిబ్యూటర్‌ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: CORONA: సోమవారం నుంచి సినిమా థియేటర్లు ఓపెన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.