ETV Bharat / sitara

Prakash Raj News: ప్రతీకారంతో 'మా' ఎన్నికల్లో పోటీ చేయట్లేదు! - ఆలీతో సరదాగా

గతంలో తనను నిషేధించిన కారణంగా.. దానికి ప్రతీకారంతో 'మా' ఎన్నికల్లో పోటీ చేయట్లేదని అన్నారు విలక్షణ నటుడు ప్రకాశ్​ రాజ్​. ఆ విషయాన్ని తానెప్పుడో మర్చిపోయానని చెబుతున్నారు. అదే విధంగా 'ఆగడు' నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని కూడా ప్రకాశ్​ రాజ్​ చెప్పారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga Talk show) కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్​ రాజ్​ ఎన్నో ఆసక్తికర సంగతులను వెల్లడించారు. ఆ విశేషాలివే..

Prakash Raj Interview in Alitho Saradaga Episode Promo
Prakash Raj News: ప్రతీకారంతో 'మా' ఎన్నికల్లో పోటీ చేయట్లేదు!
author img

By

Published : Oct 6, 2021, 5:32 AM IST

"మా' అసోసియేషన్ నిషేధించిన విషయం ఎప్పుడో మర్చిపోయాను. దానికి ప్రతీకారంగా ఇప్పుడు పోటీ చేయట్లేదు. ఇవేమీ అమెరికా ప్రెసిడెంట్‌ ఎన్నికలు కాదు కదండి" అని అన్నారు ప్రకాశ్‌ రాజ్‌(Prakash Raj News). 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి(Alitho Saradaga Talk show) విచ్చేసిన ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమం ఇది. అక్టోబరు 11న ప్రసారమయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

తన గురువు కె.బాలచందర్‌ ప్రకాశ్‌ రాజ్‌గా పేరు మార్చారని చెప్పిన ప్రకాశ్​ రాజ్​.. లక్ష్మిగారు ఒకసారి తనను చూసి దక్షిణ భారతదేశంలో గొప్ప నటుడు అవుతారని అన్నారని నటుడిగా తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. "పోకిరి' కూడా నేను చేయాల్సింది కాదు' అని ప్రకాశ్​ రాజ్​ అన్నారు. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్‌ ఇద్దరిలో ఎవరిష్టం? అని అడిగిన ప్రశ్నకు "కృష్ణవంశీ నా బంగారం. కొంచెం స్వార్థపరుడు. కానీ, వాడినే ఎక్కువగా ప్రేమిస్తాన"ని ప్రకాశ్​ రాజ్​ సమాధానమిచ్చాడు.

'ఇండస్ట్రీకి రాకముందు ముదురయ్యావా? లేక వచ్చాక ఇలా అయ్యావా?' అని ఆలీ అడిగిన ప్రశ్నకు.. 'నేను పుట్టినప్పుడే ముదురు' అని సరదాగా బదులిచ్చారు. 'తెలుగు నిర్మాతలు మీపై ఎందుకు నిషేధం విధించారు?' అనే ప్రశ్నకు ప్రకాశ్​ రాజ్​ బదులుగా 'ఒక అమ్మాయిని అల్లరి చేస్తున్నాడని ఓ వ్యక్తిని పక్కకు తోసేశాను. దాంతో ఆయన్ను కొట్టానని నా మీద కేసు పెట్టారు. 'ఆగడు' సినిమా సమయంలో శ్రీనువైట్లకు కావాల్సిన వేగం విషయంలో మాకు కొంత మనస్పర్థలొచ్చాయి. ఆ తర్వాత రోజే నా స్థానంలో సోనూసూద్‌ వచ్చారు' అని సమాధానమిచ్చారు.

వీటితో పాటు కరుణానిధితో జరిగిన ఆసక్తికర సంభాషణను, కుటుంబసభ్యులతో ఉండే అనుబంధాన్ని, విడాకులు ఇలా పలు విషయాలపై ఆయన ఆసక్తికర సమాధానాలిచ్చారు. 'మా' ఎన్నికలు నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూపై ఆసక్తికరంగా మారింది. ప్రకాశ్‌రాజ్‌ పంచుకున్న విశేషాలన్నీ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. MAA Elections 2021: 'మా'లో తారస్థాయికి మాటల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.