Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ను వెళ్లిపోమన్న నాగ్.. సిరిపై ఫైర్! - సిరి
బిగ్‌బాస్ హౌస్‌లో (Bigg Boss 5 Telugu) తరచూ గొడవ పడుతున్న షణ్ముఖ్ జస్వంత్, సిరిపై అసహనం వ్యక్తం చేశారు నాగార్జున. దీప్తిని మిస్ అయితే.. బయటకు వెళ్లిపోమని షణ్ముఖ్‌తో (Shanmukh Jaswanth Bigg Boss) అన్నారు.
గత వారం రోజులుగా బిగ్‌బాస్ (Bigg boss) హౌస్‌లో జరిగిన పరిణామాలపై నాగార్జున (Nagarjuna) మాట్లాడారు. ఈ సందర్భంగా తరచూ గొడవ పడుతున్న షణ్ముఖ్(Shanmukh), సిరి(siri)లపై అసహనం వ్యక్తం చేశారు. ఇరువురిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి క్లాస్ తీసుకున్నారు. తనని తాను గాయపరుచుకున్న సిరిపై మండిపడ్డారు. "ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా?" అని ప్రశ్నించారు. "ఏమో సర్.. నాకు క్లారిటీ లేదు. నా స్టోరీ నాకు తెలుసు. బయట నేనేంటో తెలుసు. అయినా బంధం ఏర్పడుతోంది. ఎందుకో తెలియడం లేదు" అంటూ సిరి కన్నీటి పర్యంతమైంది.
బయటకు వెళ్లిపో..!
ఇదే విషయమై షణ్ముఖ్‌ను (Shanmukh Jaswanth) ప్రశ్నించగా, "మెంటల్‌గా వీక్ అయిపోయాను సర్. దీప్తిని చాలా మిస్ అవుతున్నా సర్" అని అనగానే "బిగ్‌బాస్ ఓపెన్ ది గేట్స్. దీప్తిని మిస్ అయితే, బయటకు వెళ్లిపో" అని (Shanmukh Jaswanth Deepthi Sunaina) నాగార్జున అనడం వల్ల షణ్ముఖ్ ఆశ్చర్యపోయాడు. మరి షణ్ముఖ్ నిజంగా వెళ్లిపోయాడా? ఇద్దరికి నాగార్జున ఇచ్చిన సలహాలు ఏంటి? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: nagarjuna bigg boss 5: రవికి సూపర్‌పవర్.. సన్నీ అసహనం