ETV Bharat / sitara

మహాభారతం నటుడు ​ ప్రవీణ్​ కుమార్​ కన్నుమూత

Mahabharat Praveen Kumar: ప్రముఖ అథ్లెట్​, మహాభారతం సీరియల్​ నటుడు​ ప్రవీణ్​ కుమార్​ సోబ్తి(74) కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.

Mahabharat actor Praveen Kumar
Mahabharat actor Praveen Kumar
author img

By

Published : Feb 8, 2022, 10:27 AM IST

Updated : Feb 8, 2022, 11:10 AM IST

Mahabharat Praveen Kumar: ప్రముఖ అథ్లెట్​, మహాభారతం సీరియల్​ నటుడు​ ప్రవీణ్​ కుమార్​ సోబ్తి(74) కన్నుమూశారు. ఈ బుల్లితెర భీముడు​ గుండెపోటుతో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.

"ప్రవీణ్​ కుమార్.. దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడ్డారు. రాత్రివేళ ఆయనకు అసౌకర్యంగా ఉండటం వల్ల వైద్యుడిని సంప్రదించాం. అయినా ఫలితం లేకపోయింది. రాత్రి 10-10.30 గంటల సమయంలో గుండెపోటుతో మరణించారు" అని ప్రవీణ్ బంధువు తెలిపారు.

అథ్లెట్​గా..

ప్రవీణ్​.. డిస్కస్​ త్రో, హేమర్​త్రేలో విభాగాల్లో వివిధ అథ్లెటిక్​ ఈవెంట్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1966, 1970లో రెండు బంగారు పతకాలు సహా ఆసియా క్రీడలలో నాలుగు పతకాలను సాధించారు. 1966 కామన్​వెల్త్​ గేమ్స్​లో రజత పతకం సొంతం చేసుకున్నారు.

నటుడిగా..

ప్రవీణ్​.. అథ్లెట్​గానే కాకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆటలకు ముగింపు పలికిన తర్వాత​ నటుడిగా వెండి తెరకు పరిచయమయ్యారు. 'రక్ష' సినిమాతో ప్రవీణ్​ రంగ ప్రవేశం చేశారు. అనంతరం పలు సినిమాల్లో నటించారు. అయితే 1988లో సుప్రసిద్ధ డైరెక్టర్​ బీఆర్ చోప్రా దర్శకత్వంలో 'మహాభారతం'లో భీముడి పాత్రలో నటించి ప్రజాధరణ పొందారు.

ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.

ఇదీ చూడండి: IPL 2022: ఆ జట్టు పేరు అహ్మదాబాద్‌ టైటాన్స్‌

Last Updated : Feb 8, 2022, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.