KBC 1000 Episode: భారతీయ టెలివిజన్ రంగంలోనే అత్యంత విజయవంతమైన షోగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' పేరుగాంచింది. ఈ ప్రోగ్రాం ప్రారంభమైనప్పటి నుంచీ అంటే 2000వ సంవత్సరం నుంచి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇటీవల షో 1000వ ఎపిసోడ్ డిసెంబర్ 3న పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో తాను ఈ ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా రావడానికి గల కారణాలను వెల్లడించారు బిగ్‌బీ. ఆ సమయంలో సినిమా అవకాశాలు పెద్దగా రాలేదని, పనిలేకపోవడం కారణంగా కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు వ్యాఖ్యాతగా మారానని అన్నారు.
ఈ ప్రత్యేక ఎపిసోడ్లో బిగ్‌బీ కుమార్తె శ్వేతా బచ్చన్‌తోపాటు ఆయన మనవరాలు నవ్యానందా పాల్గొన్నారు. అమితాబ్ సతీమణి జయా బచ్చన్ సైతం.. వీడియో కాల్ ద్వారా ముచ్చటించారు. 1000వ ఎపిసోడ్‌పై స్పందిస్తూ.. "ఈ షో 2000 జులై 3లో ప్రారంభమైంది.. ఇప్పటికి 21ఏళ్లు పూర్తయ్యాయి. తాను బుల్లితెరకు రావడాన్ని అప్పట్లో విమర్శించడం గుర్తుంది. దాని వల్ల నాపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఆ సమయంలో నాకు పనిలేకపోవడం వల్లే ఈ షోకు వ్యాఖ్యాతగా మారాను" అని బిగ్‌బీ చెప్పుకొచ్చారు.
'కౌన్ బనేగా కరోడ్‌పతి' మొదటి ఎపిసోడ్‌కు ప్రేక్షకుల స్పందన చూసిన తర్వాత తనకెంతో సంతోషం కలిగిందని.. ప్రపంచం మారిపోయిందని అనిపించిందని అమితాబ్ అన్నారు. ఈ క్రమంలో తన కుమార్తె, మనవరాలితో సరదాగా ముచ్చటించారు బిగ్‌బీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: నా భార్యకు టన్నుల కొద్ది ప్రేమలేఖలు రాశాను: అమితాబ్