అతనో స్టాండప్ కమెడియన్.. అప్పటివరకు అందరిని నవ్విస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నటనలో భాగమని అందరూ అతని ప్రదర్శన చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. ఐదు నిమిషాల తర్వాత అతను నిజంగానే చనిపోయాడని గుర్తించారు.
బ్రిటీష్ స్టాండప్ కమెడియన్ ఇయాన్ కాగ్నిటో గుండెపోటుతో స్టేజీపైనే ప్రాణాలు వదిలాడు. లండన్ బైస్స్టర్లోని స్థానిక క్లబ్లో ఈ సంఘటన జరిగింది.
వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. స్టేజీపైనే ప్రాణాలు వదిలినట్టు డాక్టర్లు తెలిపారు. మరణించే ముందు వరకు నవ్వుతూ.. అందరినీ నవ్వించాడు ఇయాన్. చనిపోయిన తర్వాత కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.