ETV Bharat / sitara

వారాంతపు లాక్​డౌన్​తో బాలీవుడ్​కు కోట్ల నష్టం! - ఉద్ధవ్​ ఠాక్రే వార్తలు

మహారాష్ట్రలో వారాంతపు లాక్‌డౌన్‌ నిర్ణయం.. బాలీవుడ్‌కు శరాఘాతంలా మారింది. ఇప్పటికే పలు పెద్ద చిత్రాల విడుదల వాయిదాపడగా, మరికొన్ని సినిమాలు అదేబాటలో ఉన్నాయి. రాత్రిపూట కర్ఫ్యూతో ఇప్పటికే రెండు షోలు రద్దుకాగా.. వారాంతపు లాక్‌డౌన్‌తో శుక్రవారం రాత్రి 8గంటల నుంచి ఆదివారం వరకూ థియేటర్లు మూతపడనున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌ నాలుగు వందల కోట్ల మేర నష్టపోయినట్లు పరిశ్రమవర్గాల అంచనా! కరోనా ఆంక్షలు ఇలానే కొనసాగితే అది వేల కోట్లకు చేరుతుందని చిత్రసీమ వర్గాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి.

huge loss for bollywood theaters due to weekend lockdown
వారాంతపు లాక్​డౌన్​తో బాలీవుడ్​కు కోట్ల నష్టం!
author img

By

Published : Apr 6, 2021, 9:57 AM IST

Updated : Apr 6, 2021, 10:27 AM IST

కరోనాకట్టడి చర్యల్లో భాగంగా మహారాష్ట్ర సర్కార్‌ విధించిన వారాంతాల్లో లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ నిర్ణయంతో.. బాలీవుడ్‌కు మరోసారి గట్టి దెబ్బ తగలనుంది. ఇప్పటికే పలు భారీచిత్రాలు విడుదలకు సిద్ధమైనా.. సర్కార్‌ నిర్ణయంతో వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే వినోదరంగం కోలుకుంటున్న తరుణంలో.. లాక్‌డౌన్‌ నిర్ణయం బాలీవుడ్‌కు శరాఘాతంలా మారింది. ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు పూర్తిసామర్థ్యంతో పనిచేస్తున్నా.. మహారాష్ట్రలో 50శాతం సీటింగ్‌తో టాకీసులు నడుస్తున్నాయి.

కొవిడ్‌ కేసులు రికార్డ్‌ స్థాయిలో పెరుగుతుండటం వల్ల కట్టడి చర్యలకు దిగిన ఉద్ధవ్‌ సర్కార్‌.. వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది. శుక్రవారం రాత్రి 8గంటల నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. రాత్రిపూట కర్ఫ్యూ యథావిధిగా ఉంటుంది. సోమవారం రాత్రి 8గంటల నుంచి ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

పలు చిత్రాల విడుదల వాయిదా

అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన 'సూర్యవంశీ' చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించటం వల్ల ముందుముందు మరిన్ని గడ్డుపరిస్థితులు తప్పవన్న ఆందోళన ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్లలో వ్యక్తమవుతోంది. అమితాబ్‌ నటించిన 'చెహ్రే', సైఫ్‌-రాణి ముఖర్జీ తారాగణంగా తెరకెక్కిన 'బంటీ ఔర్‌ బబ్లీ-2' చిత్రాల విడుదల ఇప్పటికే వాయిదాపడ్డాయి.

సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'రాధే', 'సత్యమేయ జయతే-2' తదితర చిత్రాలూ వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సినిమాలు విడుదలయ్యేది అనుమానమేనని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

మూసివేత పరిష్కారం కాదు..

గతేడాది థియేటర్లను తిరిగి ప్రారంభించటానికి, కొవిడ్‌ నిబంధనల అమలు కోసం.. పెద్దమొత్తంలో ఖర్చు చేసినట్లు థియేటర్ల యాజమానులు చెబుతున్నారు. రాత్రిపూట కర్ఫ్యూతో ఇప్పటికే రెండు షోలు రద్దుకాగా.. తాజాగా తీసుకున్న వారాంతపు లాక్‌డౌన్‌తో కోట్ల రూపాయల నష్టం తప్పదని అంటున్నారు. వారాంతాల్లోనే థియేటర్లు కళకళలాడుతుంటాయని, అలాంటి రోజుల్లో లాక్‌డౌన్‌ అమలుచేయటం తమకు తీవ్ర నష్టమని థియేటర్ల యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏడాదిపాటు థియేటర్లను మూసినా.. కేసులు కొనసాగుతున్నాయని, కొవిడ్‌ కట్టడికి థియేటర్ల మూసివేత పరిష్కారం కాదంటున్నారు. కరోనా నిబంధనలపై అవగాహన కల్పించడం సహా టీకా పంపిణీపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఒక్కో థియేటర్‌కు సగటున నెలకు 2లక్షల మేర నష్టం వాటిల్లనుందని, ఇప్పటివరకూ బాలీవుడ్‌ 4వందల కోట్ల మేర నష్టపోయినట్లు ఎగ్జిబ్యూటర్లు అంచనా వేశారు.

ప్రభావం తప్పదు!

మహారాష్ట్ర ప్రభావం.. యావత్‌ దేశంపై ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బాలీవుడ్‌ సినిమాల విడుదల ఆగిపోతే...ఆ ప్రభావం ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటుందని ఎగ్జిబ్యూటర్లు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను కలిసిన థియేటర్ల యజమానులు.. ఆస్తిపన్ను, కనీస విద్యుత్తుఛార్జీలు, విడుదలయ్యే చిత్రాలకు ఆర్థిక ప్రయోజనం కల్పించాలని కోరారు. చిత్ర రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవిస్తున్నారని, వారిని ఆదుకోవాలని శివసేన ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చూడండి: టాలీవుడ్​ బ్రదర్స్​: చిరు-పవన్​ టూ విజయ్​-ఆనంద్​!

Last Updated : Apr 6, 2021, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.