కన్నడ చిత్రపరిశ్రమలో హీరోయిన్గా వెండితెర అరంగేట్రం చేసిన రేఖా వేదవ్యాస్.. 'ఆనందం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస సినిమాలతో స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న రేఖ.. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho saradaga) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె సినీ ప్రయాణంలోని విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ పంచుకున్నారు.
బతికుండగానే శ్రద్ధాంజలి
కొన్నేళ్ల క్రితం తాను చనిపోయినట్లు భ్రమ పడి కొందరు పేపర్లో శ్రద్ధాంజలి ఘటించారని రేఖా వేదవ్యాస్ వెల్లడించారు. అయితే ఓ సీరియల్ నటి రేఖ రోడ్డు ప్రమాదంలో చనిపోతే అది తానే అని కొందరు అనుకోవడం వల్ల అలా జరిగిందని స్పష్టతనిచ్చారు.
మణిరత్నం సినిమా ఛాన్స్ మిస్
హీరోయిన్గా కొనసాగుతున్న తొలినాళ్లలో డేట్ల సర్దుబాటు చేయలేక దర్శకుడు మణిరత్నం సినిమాను వదులుకున్నట్లు రేఖ తెలిపారు. ఆ సమయంలో తనను సలహాలు, సూచనలు ఇచ్చే మార్గనిర్దేశకులు లేకపోవడం వల్ల అలా అనేక అవకాశాలను చేజార్చుకున్నట్లు వెల్లడించారు. కానీ, ఇన్నేళ్ల తర్వాత తెలుగుతెరపై కనిపించాలని ఉందని ఆమె మనసులో మాట బయటపెట్టారు. అవకాశం ఇస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి తాను సిద్ధమని చెప్పారు.
రక్తంతో లవ్‌లెటర్
ఇండస్ట్రీలో తనను కొందరు ఐశ్వర్యరాయ్ చెల్లెలిగా పిలిచేవారని రేఖ చెప్పారు. నటిగా కెరీర్ ప్రారంభించిన మొదట్లో ఓ వ్యక్తి రక్తంతో లవ్‌లెటర్ రాసి పంపిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా తొలి కన్నడ సినిమా విడుదల సమయంలో తెరపై ఆమె కనిపించగానే అభిమానులు డబ్బులు చల్లారని ఆమె తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. ఇన్నేళ్ల తర్వాత ఆ హీరోయిన్ షాకింగ్ రీఎంట్రీ!