కొవిడ్ సెకండ్ వేవ్ తగ్గుతున్న నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు షో నిర్వహకులు ఐదో సీజన్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతోంది. ఈసారి గ్లామర్ డోస్ పెంచేందుకు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ను హౌస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
![Payal Rajput](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12039771_260_12039771_1622992376206.png)
'ఆర్ఎక్స్ 100' లాంటి బోల్డ్ సినిమాతో అరంగేట్రం చేసిన పాయల్.. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం దక్కించుకోలేకపోతోంది. గత సీజన్లో గెస్ట్‌గా వచ్చి, డ్యాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మను.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి తీసుకొస్తే, గ్లామర్‌కు కొదవ ఉండదని నిర్వహకులు భావిస్తున్నారు. ఆమె మాత్రం ఈ విషయమై ఎటు తేల్చుకోలేకపోతుందట. చివరగా ఆహా ఓటీటీలో వచ్చిన 'అనగ అనగా ఓ అతిథి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.
ఇది చదవండి: బిగ్‌బాస్ సెట్ సీజ్ చేసిన పోలీసులు