హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తీసిన 'స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ' వెబ్ సిరీస్ ఐఎమ్‌డీబీలో ఘనత సాధించింది. మన దేశంలో ఈ ఏడాది విడుదలైన సిరీస్‌లలో అత్యధిక రేటింగ్స్ దక్కించుకున్న టాప్-10లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హన్సల్ మెహతా దీనికి దర్శకత్వం వహించారు.
స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా.. స్టాక్ మార్కెట్‌ను ఉన్నతస్థాయికి ఏ విధంగా తీసుకెళ్లాడు. అనంతర కాలంలో జరిగిన అతడి పతనమే ఈ వెబ్ సిరీస్ కథాంశం. హర్షద్ జీవితానికి సంబంధించిన అంశాలను చూపించడంలో దర్శకుడు హన్సల్ మెహతా విజయం సాధించారనే చెప్పాలి. హర్షద్ మెహతా పాత్ర పోషించిన ప్రతీక్ గాంధీ.. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
టీవీ షోలతో పాటు వెబ్‌సిరీస్‌లకు ప్రముఖ ఐఎమ్‌డీబీ వచ్చిన రేటింగ్స్ (10 పాయింట్లకు):
స్టార్ బ్రోకర్ హర్షద్ మెహతా బయోపిక్ 'స్కామ్ 1992'.. అత్యధికంగా 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఆల్‌టైమ్ ఐఎమ్‌డీబీ టాప్-250లోనూ చోటు దక్కించుకుంది. టీవీ సిరీస్‌ల ఈ జాబితాలో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన 'పంచాయత్' రెండో స్థానంలో.. డిస్నీ+హాట్‌స్టార్ సిరీస్ 'స్పెషల్ ఓప్స్' మూడో స్థానంలో నిలిచాయి.
ఐఎమ్‌డీబీ రేటింగ్‌లో టాప్-10 వెబ్‌సిరీస్‌లు
నంబర్ | వెబ్‌సిరీస్ | ఓటీటీ వేదిక |
1 | స్కామ్ 1992 | సోనీ లివ్ |
2 | పంచాయత్ | అమెజాన్ ప్రైమ్ |
3 | స్పెషల్ ఓప్స్ | డిస్నీ+హాట్‌స్టార్ |
4 | బందిష్ బండిట్స్ | అమెజాన్ ప్రైమ్ |
5 | మీర్జాపుర్ (రెండో సీజన్) | అమెజాన్ ప్రైమ్ |
6 | అసుర్: వెల్కమ్ యువర్ డార్క్ సైడ్ | వూట్ |
7 | పాతాళ్ లోక్ | అమెజాన్ ప్రైమ్ |
8 | హై (High) | ఎమ్ఎక్స్ ప్లేయర్ |
9 | అభయ్ | జీ5 ఒరిజినల్ |
10 | ఆర్య | డిస్నీ+హాట్‌స్టార్ |