ETV Bharat / sitara

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. గ్రామీ అవార్డుల వేడుక వాయిదా - corona cases today

Grammy awards 2022: అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న ఒమిక్రాన్ కారణంగా ఈనెల చివర్లో జరగాల్సిన గ్రామీ అవార్డుల వేడుక వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు.

Grammys postpone
గ్రామీ అవార్డులు
author img

By

Published : Jan 6, 2022, 9:27 AM IST

Grammy awards news: అమెరికాలోని లాస్​ ఏంజెల్స్​లో జరగాల్సిన గ్రామీ అవార్డుల వేడుక వాయిదా పడింది. ఈ విషయమై గ్రామీ అధికారిక ప్రసార సీబీఎస్, ది రికార్డింగ్ అకాడమీ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

షెడ్యూల్​ ప్రకారం జనవరి 31న ఈ వేడుక నిర్వహించాల్సి ఉంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీటి వల్ల ఈవెంట్​లో ఇబ్బంది ఏర్పడవచ్చని అకాడమీ అంచనా వేసింది. సంగీత నిర్వహకులు, ప్రేక్షకులు, వేడుక కోసం పనిచేసే సిబ్బంది ఆరోగ్య భద్రతే తమకు ముఖ్యమని చెప్పిన అకాడమీ.. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.

Grammys postpone
గ్రామీ అవార్డు

గతేడాది కూడా కరోనా వల్ల గ్రామీ అవార్డుల వేడుక కొంతకాలం వాయిదా పడింది. ఆ తర్వాత స్టేపుల్స్ సెంటర్​కు బదులుగా లాస్​ ఏంజెల్స్​లోని కన్వెన్షన్​ సెంటర్​లో అవుట్​డోర్​ సెట్​లో ఈ కార్యక్రమం జరిగింది. గతేడాది ప్రేక్షకుల సీటింగ్ కెపాసిటీ తగ్గించడమే కాకుండా లైవ్​ ప్రదర్శన కూడా ఇవ్వలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.