'అసలేం గుర్తుకురాదు'(extra jabardasth sudigali sudheer rashmi) అంటూ రష్మి చేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేశాడు 'జబర్దస్త్' హాస్యనటుడు నరేశ్(extra jabardasth naresh). నవ్వులు పూయించేలా ఉన్న అతడి డ్యాన్స్ చూసి ఆమె సిగ్గుతో తల దించుకున్నారు. మరోవైపు రోజా సైతం.. 'నరేశ్.. అమ్మాయి గెటప్‌లో నువ్వు భలే క్యూట్‌గా ఉన్నావు. నీ బుగ్గలు గిల్లాలనిపిస్తోంది' అంటూ కామెంట్ చేశారు. ఈ సరదా, ఫన్‌ఫుల్ మాటలకు 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' వేదికైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రష్మి(extra jabardasth rashmi) వ్యాఖ్యాతగా ప్రతి శుక్రవారం ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో 'ఎక్స్‌ట్రా జబర్దస్త్'. రోజా, మనో న్యాయనిర్ణేతలు. తాజాగా వచ్చే శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రేమ వివాహం కాన్సెప్ట్‌పై కెవ్వు కార్తీక్ ఓ సరదా స్కిట్ చేశారు. ఇందులో భాగంగా కార్తీక్ స్కిట్‌లో సుడిగాలి సుధీర్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. నరేశ్ లేడీ గెటప్‌లో తనదైన పంచులతో నవ్వులు పూయించారు. ఎప్పటిలానే వరుస ఆటో పంచులతో సుధీర్(extra jabardasth sudigali sudheer skits) స్కిట్ అలరించేలా ఉంది. 'అన్నా.. ఇటీవల ఓ పెద్దాయన ప్రవచనాలు చెబుతున్న వీడియోలకు మన వాళ్లు నీ గురించి కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి, మన వాళ్లకు కొంచెం చెప్పన్న' అంటూ భాస్కర్.. సుధీర్‌కి చెప్పారు. వెంటనే రష్మి స్పందిస్తూ.. "మొన్న నేను కూడా ఓ వీడియో కింద సుధీర్ గురించి ఆయన ఫ్యాన్స్ చేసిన కామెంట్లు చూశాను. 'మా ఇంట్లో బ్రష్ సుధీర్ అన్న ఫ్రెష్' అని వాళ్లు కామెంట్ చేశారు' అంటూ నవ్వులు పూయించారు.
ఇదీ చూడండి: సూపర్ ట్విస్ట్.. 'జబర్దస్త్'లో బాలకృష్ణ.. రోజా కోసం..