ETV Bharat / sitara

ఈటీవీ సరికొత్త సీరియల్స్​.. చూసేందుకు సిద్ధమా! - శతమానం భవతి సీరియల్​

క్వాలిటీ షోలు, సరికొత్త సీరియల్స్​తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది 'ఈటీవీ'. ఈ క్రమంలోనే కుటుంబ ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు సోమవారం (ఏప్రిల్​ 5) నుంచి మరిన్ని కొత్త సీరియల్స్​ను మీ ముందుకు తీసుకొస్తోంది. మరి ఆ సీరియళ్లు ఏవో తెలుసుకుందామా!

ETV ready to entertain with the newest serials
ఈటీవీ సరికొత్త సీరియల్స్​.. చూసేందుకు సిద్ధమా!
author img

By

Published : Apr 5, 2021, 9:20 AM IST

ఎల్లపుడూ సరికొత్త సీరియల్స్​తో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తోన్న 'ఈటీవీ'.. సోమవారం (ఏప్రిల్​ 5) నుంచి మరో మూడు ధారావాహికలను మీ ముందుకు తీసుకొస్తోంది. సకుటుంబ సపరివార సమేతంగా చూసేట్టుగా ఈ సీరియళ్లను రూపొందిస్తోంది. 'గౌరమ్మ', 'రన్​', 'శతమానం భవతి' ధారావాహికలను ప్రసారం చేసేందుకు ఈటీవీ సిద్ధమైంది. మరి వాటి గురించి తెలుసుకుందామా.

బంగారు 'గౌరమ్మ'.. కష్టాల జీవితం!

వరాలిచ్చే దేవత ఊరూరా ఉంటుంది. అలాగే వారి ఊరికి వరమైన దేవత గౌరమ్మ. ఆమె ముట్టుకుంటే బంగారమే. తన చేత ఏది ప్రారంభించినా అది దిగ్విజయమే. అలాంటి ఆమె జీవితంలోకి రాముడి లాంటి భర్త వస్తాడని అందరూ అనుకుంటే రావణుడు వస్తే? గోదారిలా సాగిపోతున్న ఆమె జీవితం ఏ తీరానికి చేరబోతుంది? ఎన్ని మలుపులు తిరగబోతుంది? వంటి అంశాలతో ఆమె జీవితంలో ఎదురైన కష్టసుఖాల సమాహారమే 'గౌరమ్మ' సీరియల్. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ప్రసారం కానుంది.

'గౌరమ్మ' సీరియల్​ ప్రోమో

సరికొత్త 'రన్'​..

'రన్' పేరుతో వస్తోన్న ఈ సీరియల్ ఏప్రిల్ 5 (సోమవారం) నుంచి ప్రతిరోజు (సోమవారం-శనివారం) మధ్యాహ్నం 1.00 గంటకు ప్రసారం కానుంది. ఎన్నో మలుపులు. మరెన్నో ఆసక్తి రేకెత్తించే అంశాలతో మీ ముందుకు రాబోతున్న ఈ సీరియల్​ ప్రోమోను చూసి ఆనందించండి.

'రన్​' సీరియల్​ ప్రోమో

స్వచ్ఛమైన కథతో..

భానుమతి పెళ్లికి సంబంధించిన కథతో వస్తోన్న ఈ సీరియల్​ ఎన్నో మలుపులు, భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరిస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రసారం కానుంది. మరెందుకు ఆలస్యం ఈ సీరియల్ ప్రోమో చూసి ఆనందించండి.

'శతమానం భవతి' సీరియల్​ ప్రోమో

ఇదీ చూడండి: నిషా కళ్లతో కైపెక్కిస్తున్న గ్లామర్​ బ్యూటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.