అలనాటి ప్రముఖ నటి సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని తీపి జ్ఞాపకాలను దర్శకుడు, సంగీత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి(sv krishna reddy movies) గుర్తుచేసుకున్నారు. సౌందర్య మృతి తర్వాత కొన్నేళ్ల పాటు ఆమె పాట కానీ సినిమా వచ్చినా కానీ టీవీ ఆఫ్ చేసేవాడినని అన్నారు. అంతగొప్ప నటి మన కళ్లముందు లేకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్ గేమ్ షో 'క్యాష్'(cash latest promo). వచ్చే వారం ప్రసారమయ్యే 175వ ఎపిసోడ్లో(Cash Show) పాల్గొన్న ఎస్వీ కృష్ణారెడ్డి(sv krishna reddy age).. మంచి పాత్రలు, గొప్ప పాత్రలు ఏమైనా చేద్దామన్నా మళ్లీ ఒక సౌందర్య రాదని అన్నారు.
ఈ షోలో కృష్ణారెడ్డితో పాటు సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, కల్యాణి మాలిక్, రఘు కుంచె తదితరులు పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ సెప్టెంబరు 25న ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో(cash latest promo) చూసేయండి.
ఇదీ చదవండి: ఇండస్ట్రీలో అదొక్కటే నన్ను కాపాడింది: ఎస్వీ కృష్ణారెడ్డి