ETV Bharat / sitara

Big Boss telugu 5: ఈ వారం మొదట సేఫ్‌ అయింది వీళ్లే! - Bigg Boss 5 nominations

బిగ్​బాస్​లో (Bigg Boss 5 Telugu) వీకెండ్​ ఎపిసోడ్​కు ఉన్నంత క్రేజ్​ అంతా ఇంతా కాదు. అయితే.. ఈ వారం హౌస్‌లో ఉన్న 16మందిలో ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఎవరెవరు సేఫ్ అయ్యారంటే..

BIGG BOSS 5
బిగ్ బాస్ తెలుగు
author img

By

Published : Oct 3, 2021, 8:29 AM IST

Updated : Oct 3, 2021, 8:39 AM IST

రోజూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వీకెండ్స్‌లో ఆ వినోదాన్ని రెట్టింపు చేస్తోన్న రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌-5'(Bigg Boss Telugu 5). ఈ వారం హౌస్‌లో ఉన్న 16మందిలో ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. కాగా, శనివారం వీరిలో మొదటగా రవి, ప్రియ, సన్నీ, కాజల్‌లు సేఫ్‌ అయ్యారు. సిరి, నటరాజ్‌, లోబో, అనీ మాస్టర్‌లు ఇంకా నామినేషన్స్‌లో కొనసాగుతున్నారు.

వాళ్లకి క్లాస్‌ తీసుకున్న నాగార్జున

ఈ వారం నామినేషన్స్‌ నుంచి శుక్రవారం వరకూ జరిగిన పరిణామాలను విశ్లేషిస్తూ హౌస్‌మేట్స్‌కు క్లాస్‌ తీసుకున్నారు వ్యాఖ్యాత నాగార్జున. ముఖ్యంగా హౌస్‌మేట్స్‌ బరువు తగ్గిన దాన్ని ప్రశంసించారు. ఇక నామినేషన్స్‌ సందర్భంగా లోబో ప్రవర్తనను ఖండించారు. 'నా వరకూ నేను బరాబర్‌ చేసిన.. జనాలకు ఏం నచ్చుతుందో, నచ్చటం లేదో నాకు తెలియదు సర్‌' అని లోబో అనగా, 'అరవటం కూడా బరాబర్‌ అంటావా' అనగా 'లవ్‌ పదం ఎత్తగానే నాకు కోపం వచ్చింది' అని లోబో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. 'నీ ఒక్కడికే ఉందా ప్రేమ మిగతా వాళ్లకు లేదా? అరిచేసి, గొంతు చించుకుని..’ అంటూ లోబో మాట్లాడిన వీడియోను చూపించేసరికి, అతడు సారీ చెప్పాడు. 'ఈ వారం లోబోను చూస్తే నాకు భయం వేసింది. ఒంటరిగా నేను గదిలో ఉన్నప్పుడు లోబో వస్తే వణికిపోయేదాన్ని' అంటూ నాగార్జున ఎదుట ప్రియ వాపోగా, 'బిగ్‌బాస్‌ హౌస్‌ను మించిన భద్రమైన ప్రదేశం మరొకటి లేదు' అంటూ నాగార్జున భరోసా ఇచ్చారు. షణ్ముఖ్‌, సిరిలకు పచ్చి మిర్చి తినిపించిన నాగ్‌.. 'కూర్చొని కబుర్లు చెబుతున్నావేం' అంటూ షణ్ముఖ్‌ను, 'అమ్మా నీ ఆట నువ్వు ఆడమ్మా' అంటూ సిరికి గట్టి ఝలక్‌ ఇచ్చారు. లవ్‌ ట్రాక్‌ నడుపుతున్న శ్రీరామచంద్ర-హమీదాలను ఆటపట్టించారు.

bigg boss telugu
సేఫ్​ అయిన కంటెస్టెంట్లు

బిగ్‌బాస్‌ యాప్‌ స్టోర్‌.. ఎవరెవరికి ఏ యాప్‌

ఇంటి సభ్యుల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారన్న దానిపై 'బిగ్‌బాస్‌ యాప్‌ స్టోర్‌' పేరుతో హౌస్‌మేట్స్‌తో గేమ్‌ ఆడించారు నాగార్జున. యాప్‌ స్టోర్‌లో మైండ్‌ యువర్‌ ఓన్‌ యువర్‌ బిజినెస్‌, వాచ్‌ యువర్‌ టంగ్‌, యూజ్‌ యువర్‌ బ్రైన్‌, సింపథీ గెయినర్‌, అటెన్షన్‌ సీకర్‌ యాప్‌లు ఎవరెవరికి సరిపోతాయో చెప్పమనగా, అటెన్షన్‌ సీకర్‌ యాప్‌ ప్రియాంకకు, యూజ్‌ యువర్‌ బ్రైన్‌/ వాచ్‌ యువర్‌ టంగ్‌ యాప్‌ను లోబోకు సరిపోతాయని అత్యధిక మంది చెప్పారు. 'మైండ్‌ యువర్‌ ఓన్‌ బిజినెస్‌' యాప్‌ రవికి సరిపోతుందని, తనకు సంబంధించిన అన్ని విషయాల్లో రవి కలగజేసుకుంటున్నాడని జెస్సీ అసహనం వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ టాస్క్‌ సందర్భంగా కాజల్‌ ఆడిన మైండ్‌ గేమ్‌, ఆ తర్వాత మాట్లాడిన మాటలకు ఆమెకు శ్వేతవర్మ 'వాచ్‌ యువర్‌ టంగ్‌' యాప్‌ ఇచ్చింది.

bigg boss telugu
వీరిద్దరు సేఫ్

ఎలిమినేట్‌ అయ్యే దెవరు?

ఈ వారం నామినేషన్స్‌ ఉన్న 8మందిలో శనివారం నలుగురు సేఫ్‌ అయ్యారు. సిరి, నటరాజ్‌, లోబో, అనీ మాస్టర్‌లు ఇంకా నామినేషన్స్‌లో కొనసాగుతున్నారు. మరి వీరిలో ఎలిమినేట్‌ అయ్యేదెవరో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్‌ చూడాల్సిందే!

ఇదీ చదవండి:'ఇది బస్తీ కాదు... లోబోకు వార్నింగ్​ ఇచ్చిన నాగార్జున!​'

Last Updated : Oct 3, 2021, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.