ETV Bharat / sitara

సూపర్​ ట్విస్ట్.. 'జబర్దస్త్​'లో బాలకృష్ణ.. రోజా కోసం.. - జబర్దస్త్​ లేటెస్ట్​ ఎపిసోడ్​

'జబర్దస్త్'​ షోలో త్వరలో సందడి చేయనున్నారు స్టార్​ హీరో బాలకృష్ణ. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. వచ్చేవారం ప్రసారం కానున్న ఎపిసోడ్​ ప్రోమో నవ్వులు పూయిస్తోంది. ఈ సందర్భంగా జబర్దస్త్ జడ్జి రోజాతో ఫోన్​లో​ మాట్లాడిన బాలయ్య.. షోకు వస్తానని మాటిచ్చారు.

balayya
బాలయ్య
author img

By

Published : Oct 15, 2021, 9:32 AM IST

వెండితెరపై మాస్​ డైలాగ్స్​, యాక్షన్స్​ సీన్స్​తో అగదరగొట్టే హీరో బాలకృష్ణ తనలోని నయాషేడ్​తో ప్రేక్షకులను నాన్​స్టాప్​గా​ అలరించేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే ఓటీటీ 'ఆహా' వేదికగా ఓ టాక్​షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు రెడీ అయిన బాలయ్య.. త్వరలోనే ఖతర్నాక్‌ కామెడీ షో 'జబర్దస్త్‌' ప్రేక్షకులను అలరించనున్నారు! ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.

గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న 'జబర్దస్త్‌' తాజా ప్రోమో నవ్వులు పూయిస్తోంది. వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్​లో భాగంగా కంటెస్టెంట్​లు, యాంకర్​ అనసూయ.. బాలయ్యకు ఫోన్​ చేయాలని రోజాను కోరారు. ఆమె బాలయ్యకు కాల్​ చేసి మాట్లాడారు. దీంతో త్వరలోనే తాను 'జబర్దస్త్'​ షోకు జడ్జ్​గా వస్తానని చెప్పారు బాలయ్య. 'మళ్లీ మనం ఇద్దరం కలిసి ఎప్పుడు నటిద్దాం' అని రోజా అడగ్గా... 'మన కాంబినేషన్​ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వస్తా షోకు' అని బాలయ్య అన్నారు.

అభి, రాఘవ, ఆదితోనూ సరదాగా సంభాషించారు బాలకృష్ణ. 'అందరూ నాకంటే పెద్దోళ్లు.. నా వయసు పదహారేగా' అంటూ నవ్వులు పూయించారు. ఎంతో బిజీ షెడ్యూల్​లో ఉండే బాలయ్య.. కాల్​ లిఫ్ట్​ చేసి మాట్లడడంతో రోజా, కంటెస్టెంట్​లు ఆనందం వ్యక్తం చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో హైపర్​ ఆది, చలాకీ చంటి, రాకెట్​ రాఘవ, ఇమ్మాన్యుయెల్​, తాగుబోతు రమేష్​ తమ స్కిట్​లతో నవ్వులు పూయించారు. దానికి సంబంధించిన ప్రోమోను చూసి ఆనందించండి...

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఓటీటీలో బాలయ్య.. హోస్ట్​గా రచ్చ రచ్చే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.