ETV Bharat / sitara

'నేను, పవన్ కల్యాణ్ హిమాలయాలకు వెళ్లాలనుకున్నాం' - ఆలీతో సరదాగా ఆనంద్ సాయి వాసుకి

ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి ఈవారం అతిథిగా హాజరయ్యారు ఆనంద్ సాయి, వాసుకి దంపతులు. పవన్ కల్యాణ్​తో తన స్నేహబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఆనంద్.

Art director Anand Sai about Pawan Kalyan
'నేను, పవన్ కల్యాణ్ హిమాలయాలకు వెళ్లాలనుకున్నాం'
author img

By

Published : Mar 2, 2021, 10:13 AM IST

"నా జీవితంలో ఎవరికైనా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలంటే అది పవన్‌కల్యాణ్‌కే" అని ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయి అంటున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఆనంద్‌సాయి, వాసుకి దంపతులు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో "ఒక పెద్ద హీరోతో కలిసి హిమాలయాలకు వెళ్లిపోయి బాబాగా మారిపోదామనుకున్నారంట? నిజమేనా?" అని ఆలీ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు ఆనంద్ సాయి.

"మీకు తెలియంది ఏముంది. పవన్​ కల్యాణ్​తో వెళ్దామనుకున్నా. ప్లాన్ చేశాం. కానీ కుదరలేదు. బికాజ్ తనకి సినిమా వచ్చి తను హైదరాబాద్ వెళ్లిపోయాడు. సో సినిమా కోసం హైదరాబాద్​కు వెళ్లిపోయాక నేను ఇక్కడ ఉన్నాను చెన్నైలో. మేమిద్దరం చాలా క్లోజ్​గా చాలా ఏళ్లుగా తెలుసు" అంటూ చెప్పుకొచ్చారు ఆనంద్.

"ఈ సందర్భంగా ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు?" అని ఆలీ అడగ్గా.. పవన్ కల్యాణ్ అని సమాధానమిచ్చారు ఆనంద్. "ఐ వాంట్ టూ థ్యాంక్ కల్యాణ్ అన్నయ్య. ఎందుకంటే నాలో ఆర్ట్ ఉందని ఫస్ట్ గుర్తించింది ఆయనే. అప్పటివరకు నేను పెన్సిల్​తో డ్రాయింగ్ కూడా చేసింది లేదు. 'సుస్వాగతం' సమయంలో ఊరికే ఖాళీగా కూర్చోవడం ఎందుకని సెట్ మొత్తం డ్రాయింగ్ చేస్తూ ఉన్నా. అది చూసి ఆయన చెప్పాడు 'నీ దగ్గర ఆర్ట్ ఉంది' అని అందుకే థ్యాంక్స్​ టూ కల్యాణ్ గారు" అంటూ చెప్పారు ఆనంద్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.