శ్రీముఖి యాంకర్ మాత్రమే కాదు.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో టాప్ ర్యాంకర్. తనదైన యాంకరింగ్‌తో అభిమానుల మనసులకు బేడీలు వేసింది. ఫటాఫట్ పంచులతో.. ధనాధన్ డైలాగ్‌లతో యూత్‌ను ఫిదా చేసింది. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి గతంలో యాంకర్ రవితో కలిసి వచ్చినప్పుడు ఎన్నో సరదా సంగతుల్ని పంచుకుంది.
'జులాయి' తర్వాత పెద్ద సినిమాలు ఎక్కువగా ఎందుకు చేయలేదు? అని అలీ శ్రీముఖిని అడగ్గా.. అది చేస్తున్నప్పుడు ఇదే మొదటి, చివరి చిత్రమని నాన్న చెప్పారు. 'టీవీల్లో ఎక్కువ షోలు చేస్తే, సినిమాల్లో అవకాశాలు రావు. మంచి కథలను ఎంచుకుని సినిమాలు చెయ్' అని త్రివిక్రమ్‌గారు సూచించారు. 'అదుర్స్', 'అదుర్స్2' అయిపోయిన తర్వాత ఏ టీవీ షోలూ ఒప్పుకోలేదు. అయితే, అదే సమయంలో మంచి సినిమాలు కూడా రాలేదు. చిన్నచిన్న సినిమాలు వచ్చాయి. 'ఎక్స్‌పోజింగ్ చేయాలి. ముద్దు సీన్లలో నటిస్తారా?' అని అడిగారు. కుదరదని చెప్పానని శ్రీముఖి చెప్పింది.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పిన శ్రీముఖి.. అబ్బాయిలు మాస్‌గా ఉంటేనే తనకు ఇష్టమని వెల్లడించింది. అలానే చిన్నప్పటి తన లవ్‌స్టోరీని కూడా చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">