"నా జీవితంలో ఎవరికైనా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలంటే అది పవన్‌కల్యాణ్‌కే" అని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి అంటున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ఈ వారం అతిథులుగా ఆనంద్‌సాయి, వాసుకి దంపతులు విచ్చేశారు. వాసుకి 'తొలిప్రేమ' చిత్రంలో పవన్‌కల్యాణ్ చెల్లెలి పాత్రలో నటించి ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అదే సినిమాతో ఆర్ట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆనంద్‌సాయి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ప్రేమబంధం ఎలా బలపడింది? ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? ఆనంద్‌సాయి ఎవరిని దృష్టిలో పెట్టుకుని తాజ్‌మహల్ సెట్‌ను వేశారు? వంటి విషయాలను వారు ఈ షోలో పంచుకున్నారు. అలాగే పవన్ కల్యాణ్‌తో ఆనంద్‌సాయికి ఉన్న స్నేహబంధం ఎలాంటిది? తన భర్త రూపకల్పన చేసిన సినీ సెట్స్‌లో వాసుకి బాగా ఇష్టమైన్ సెట్ ఏది? ఆనంద్‌సాయి స్థపతిగా మారి యాదాద్రి నిర్మాణం దాకా సాగిన ప్రయాణం గురించిన విషయాలు తెలుసుకోవాలంటే సోమవారం దాకా వేచి ఉండాల్సిందే. అప్పటిదాకా ఈ ప్రోమో చూసి ఆనందించండి!
- " class="align-text-top noRightClick twitterSection" data="">