'శ్రీ మహాలక్ష్మి' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. 'అవును', 'సీమ టపాకాయ్' వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న మలయాళీ నటి పూర్ణ. ఇటీవల ఆమె బాలకృష్ణ 'అఖండ'లో పద్మావతి పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఇదే సినిమాలో వరదరాజులుగా శ్రీకాంత్ తన నటనతో అందర్నీ భయపెట్టేశారు. ఈ ఇద్దరూ ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ కెరీర్‌పై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా పూర్ణ మాట్లాడుతూ.. "అవును' సినిమా చేసినంత కాలం నాకెలాంటి భయం వేయలేదు. ఎంతో సరదాగానే షూటింగ్ పూర్తి చేశాను. కానీ అది విడుదలయ్యాక ఓసారి ఆ సినిమా చూసి దాదాపు 2 నెలలపాటు నిద్రపోలేదు. చీకటిపడితే చాలు భయమేసేది. ఆఖరికి స్నానం చేసే సమయంలోనూ నా పక్కన ఎవరైనా కూర్చొన్నారా? అని కంగారుపడేదాన్ని" అని అన్నారు. అనంతరం ఇండస్ట్రీలో తనకు అనుకున్నంత పేరు రాకపోవడంపై మాట్లాడుతూ.. "సినిమాలపై నేను ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు. సినిమా పరిశ్రమకు వచ్చాక కొన్నింటికి 'ఎస్' చెప్పాల్సి ఉంటుంది. కానీ నేను చాలాసార్లు 'నో' చెప్పాను. నాకు ఇప్పటికీ గుర్తు 'సీమ టపాకాయ్' సమయంలో నేను ఎన్నోసార్లు 'నో' అన్నాను. అలా అనబట్టే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండగలిగాననుకుంటా" అని పూర్ణ వివరించారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాశీతో కలిసి ఓ సినిమా చేస్తున్న సమయంలో డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో డైరెక్టర్ తనను ఇబ్బందిపెట్టాడని.. దాంతో విసుగొచ్చి కోపంతో సెట్‌లో నుంచి బయటకు వెళ్లిపోయానని చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: