ETV Bharat / sitara

'Ishq Review: డిఫరెంట్ లవ్ స్టోరీ మెప్పించిందా? - తేజ సజ్జా ప్రియా వారియర్ ఇష్క్

తేజ సజ్జా, ప్రియా వారియర్ జంటగా నటించిన చిత్రం 'ఇష్క్'. నేడు (జులై 30) థియేటర్లలో విడుదలైందీ సినిమా. ఈ నేపథ్యంలో మూవీ ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

Teja Sajja Ishq
ఇష్క్
author img

By

Published : Jul 30, 2021, 7:03 PM IST

చిత్రం: ఇష్క్-నాట్ ఎ ల‌వ్ స్టోరీ

న‌టీన‌టులు: తేజ స‌జ్జా, ప్రియా ప్రకాష్ వారియ‌ర్‌, ర‌వీంద‌ర్‌ త‌దిత‌రులు

సంగీతం: మ‌హ‌తి స్వర సాగ‌ర్‌

ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు

కూర్పు: ఎ.వ‌ర‌ప్రసాద్

నిర్మాత‌లు: ఎన్వీ ప్రసాద్‌‌, ప‌రాస్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌

నిర్మాణ సంస్థ‌: మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్

ద‌ర్శక‌త్వం: ఎస్‌.ఎస్‌.రాజు

విడుద‌ల తేదీ: 30-07-2021

క‌రోనా రెండో ద‌శ ఉద్ధృతి వ‌ల్ల మూడు నెల‌లుగా చీక‌ట్లు క‌మ్ముకున్న వెండితెర‌ మ‌ళ్లీ కొత్త కాంతులు నింపుకొంది. కొత్త పోస్టర్లతో సినీ ప్రియుల‌కు స్వాగ‌తం ప‌లికింది. అలా ఈవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో తేజ స‌జ్జా 'ఇష్క్: నాట్ ఎ ల‌వ్ స్టోరీ' ఒక‌టి. 'జాంబిరెడ్డి' వంటి హిట్ త‌ర్వాత తేజ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం.. కొన్నేళ్ల విరామం త‌ర్వాత మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్ సంస్థలో రూపొందిన సినిమా కావ‌డం వల్ల దీనిపై మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. దీనికి త‌గ్గట్లుగానే టీజ‌ర్లు, ట్రైల‌ర్లు ఆస‌క్తిక‌రంగా ఉండ‌టం వల్ల ప్రేక్షకుల్లో అంచ‌నాలు రెట్టింప‌య్యాయి. మ‌రి 'ఇష్క్' వారి అంచ‌నాల‌ను అందుకుందా? ఈ చిత్రంతో తేజ మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడా? అనేది సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

Teja Sajja Ishq
ఇష్క్

క‌థేంటంటే?

సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు (తేజ స‌జ్జా) విశాఖ‌ప‌ట్నంలో ఉండే ఓ మ‌ధ్యత‌ర‌గ‌తి కుర్రాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప‌నిచేస్తుంటాడు. అన‌సూయ అలియాస్ అను (ప్రియా ప్రకాష్ వారియ‌ర్‌)తో ప్రేమ‌లో ఉంటాడు. అను పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమెకి స‌ర్‌ప్రైజ్ ఇవ్వడానికి త‌న‌తో క‌లిసి కారులో లాంగ్ డ్రైవ్‌కి వెళ్తాడు. ఈ ప్రయాణంలో సిద్ధు, అను అనుకోని స‌మ‌స్యలో చిక్కుకుంటారు. కారులో వాళ్లిద్దరూ స‌న్నిహితంగా ఉన్న ఫొటోలను మాధ‌వ్ (ర‌వీంద‌ర్‌) త‌న ఫోన్‌లో బంధించి.. పోలీస్ ఆఫీస‌ర్ అంటూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. అను ముందే సిద్ధుని అవమానిస్తూ.. త‌న అస‌భ్యక‌ర ప్రవర్తనతో ఆమెని ఇబ్బంది పెడ‌తాడు. కారులోనే ఆమెపై అఘాయిత్యం చేసేందుకు ప్రయ‌త్నిస్తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? సిద్ధు, అను అత‌ని బారి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారు? మాధ‌వ్ మీద సిద్ధు ఎలా ప‌గ తీర్చుకుంటాడు? చివ‌రికి ఈ ఇద్దరి ప్రేమ ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే?

ఇదొక విభిన్నమైన రొమాంటిక్ థ్రిల్లర్‌‌. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన 'ఇష్క్‌'కి రీమేక్‌గా రూపొందించారు. మ‌ల‌యాళం నుంచి దిగుమ‌తి చేసుకున్న క‌థ అన‌గానే క‌థ‌లో ఎన్ని మ‌లుపులున్నాయో.. ఎలాంటి ట్విస్ట్‌లుంటాయో అని ఆస‌క్తి ఏర్పడ‌టం స‌హ‌జ‌మే. కానీ, ఆ ఆస‌క్తి సినిమా ప్రారంభ‌మైన పావుగంటకే ఆవిరైపోతుంది. దర్శకుడు మాతృకలోని క‌థ‌ను తెలుగు నేటివిటికి త‌గ్గట్లుగా కాస్త మార్పులు చేసి య‌థాత‌థంగా చూపించే ప్రయత్నం చేశాడు. ప్రేమ జంట‌ల‌పై పోలీసు పేరుతో న‌కిలీగాళ్లు దాడులు చేయ‌డం త‌ర‌చూ చూస్తూనే ఉంటాం. అలాంటి సంఘ‌ట‌న‌లే ఈ చిత్ర క‌థ‌కు మూలం. ఆరంభంలో సిద్ధు.. అనుల ప్రేమ‌ను ప‌రిచ‌యం చేయ‌డం.. ఓ పాట‌.. ఆ వెంట‌నే ఇద్దరూ లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి సమస్యల్లో చిక్కుకోవ‌డం వంటి స‌న్నివేశాల‌తో దర్శకుడు క‌థ‌లోకి తీసుకెళ్లే ప్రయ‌త్నం చేశాడు. స‌రిగ్గా సిద్ధు, అను స‌న్నిహితంగా ఉన్న సంద‌ర్భంలోనే.. వారి ఫొటోల‌ను ఫోన్‌లో బంధించి పోలీస్‌నంటూ మాధ‌వ్ క‌థ‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమా ఆస‌క్తిక‌రంగా మారుతుంది. అయితే అక్కడి నుంచే క‌థ‌లో వేగం మంద‌గిస్తుంది. ఆ ప్రేమ జంట‌ నుంచి డ‌బ్బు లాగ‌డం కోసం పోలీస్‌లా మాధ‌వ్ చేసే హ‌డావుడి, అత‌ని బారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి సిద్ధు చేసే ప్రయ‌త్నాలు ఏమాత్రం మెప్పించ‌వు. ఒకానొక స‌మ‌యంలో హీరో ఓ చేత‌గాని వ్యక్తిలా క‌నిపిస్తాడు. దీనికి తోడు క‌థ మొత్తం ఓ కారు చుట్టూనే తిరుగుతుండ‌టం వల్ల.. క‌థ‌నం చాలా చప్పగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. స‌రిగ్గా విరామ స‌మ‌యానికి ముందు మాధ‌వ్ కారులో అనుపై అఘాయిత్యానికి ప్రయ‌త్నించ‌డం.. అనంత‌రం సిద్ధు డ‌బ్బిచ్చి అత‌ని నుండి బ‌య‌ట ప‌డ‌టం వల్ల క‌థలో కాస్త క‌ద‌లిక వ‌స్తుంది.

Teja Sajja Ishq
ఇష్క్

ఇక ద్వితీయార్ధంలో మాధ‌వ్ పోలీస్ కాద‌ని సిద్ధుకి తెలియ‌డం.. అత‌నిపై ప‌గ తీర్చుకునేందుకు సిద్ధు నేరుగా వాళ్లింటికి వెళ్లడం త‌ర్వాత ఏం జ‌ర‌గ‌బోతుంద‌న్న ఆస‌క్తి పెరుగుతుంటుంది. అయితే అత‌ను వాళ్లింటికి వెళ్లాక వ‌చ్చే స‌న్నివేశాలు మ‌రీ సాగ‌తీత‌గా అనిపిస్తాయి. మాధ‌వ్‌ను అత‌ని భార్యాపిల్లల ముందే సిద్ధు కొట్టడం.. త‌న‌దైన శైలిలో అత‌న్ని రివ‌ర్స్‌లో ఆడుకోవ‌డం వంటి స‌న్నివేశాలు ద్వితీయార్ధానికి కాస్త ఊపు తీసుకొస్తాయి. అయితే అత‌ను త‌న ప్రేయ‌సిపై ప్రేమ‌తో మాధ‌వ్‌పై ప‌గ తీర్చుకున్నాడా? లేక ప్రేయ‌సిపై త‌న‌కున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవ‌డానికి అలా చేశాడా? అన్నది అర్థం కాకుండా ద‌ర్శకుడు ముగింపునిచ్చిన తీరు ప్రేక్షకుల‌కు అంత‌గా రుచించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే?

ప్రేమ జంట‌ల‌పై దాడుల నేప‌థ్యంతో అల్లుకున్న క‌థ కొత్తదే అయినా.. దాన్ని ఆస‌క్తిక‌రంగా చెప్పడంలో దర్శకుడు ఆద్యంతం త‌డ‌బ‌డ్డాడు. ప్రథమార్ధం మ‌రీ నెమ్మదిగా సాగుతూ.. ప్రేక్షకుల స‌హ‌నానికి పరీక్షలా నిలిచింది. ప్రేయ‌సి ఆప‌ద‌లో ఉన్నా.. ఏమీ చేయ‌లేని చేత‌గాని వ్యక్తిలా క‌థానాయ‌కుడ్ని చూపించిన తీరు ఏమాత్రం రుచించ‌దు. సిద్ధు పాత్రకు తేజ సరిపోయాడు. ప్రథమార్థంలో మాధ‌వ్‌ను ఎద‌రించ‌లేక... క‌సితో త‌న‌లో తానే ర‌గిలిపోయే కుర్రాడిగా తేజ ప‌లికించిన హావ‌భావాలు ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా ద్వితీయార్ధంలో మాధ‌వ్‌పై ప‌గ తీర్చుకునే సంద‌ర్భంలో తేజ న‌ట‌న హైలైట్‌గా నిలుస్తుంది. ఒకానొక ద‌శ‌లో అత‌ని పాత్రలో ప్రతినాయకుడి ఛాయలు కనిపిస్తాయి. ప్రియా ప్రకాష్ వారియ‌ర్ ఉన్నంత‌లో బాగానే క‌నిపించింది. న‌ట‌న ప‌రంగా ఆమెకి చేయ‌డానికి పెద్దగా స్కోప్ దొర‌క‌లేదు. మాధ‌వ్‌గా ర‌వీంద‌ర్ న‌ట‌న బాగుంది. ఒక‌ర‌కంగా సినిమాలో క‌థానాయ‌కుడి పాత్ర క‌న్నా అత‌ని పాత్రకే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. మ‌హ‌తి స్వర సాగ‌ర్ నేప‌థ్య సంగీతం, శ్యామ్ కె.నాయుడు ఛాయాగ్రహ‌ణం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మాతృక‌తో పోల్చితే ఈ సినిమా విష‌యంలో కాస్త నిడివి త‌గ్గించడం.. ప్రేక్షకుల‌కు ఊర‌టనిచ్చే విష‌యం.

Teja Sajja Ishq
ఇష్క్

బ‌లాలు

క‌థా నేప‌థ్యం

తేజ న‌ట‌న, సినిమా నిడివి

బ‌లహీన‌త‌లు

ప్రథమార్ధం

పతాక సన్నివేశాలు

చివ‌రగా: ఇష్క్‌: ఏ బోరింగ్ స్టోరీ

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.