ETV Bharat / sitara

రివ్యూ: 'డిస్కోరాజా'గా రవితేజ ఆకట్టుకున్నాడా..!

author img

By

Published : Jan 24, 2020, 1:18 PM IST

Updated : Feb 18, 2020, 5:39 AM IST

మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా 'డిస్కోరాజా'. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ హీరో హిట్ కొట్టాడా? లేదా? అనేది ఈ సమీక్ష చూసి తెలుసుకుందాం.

డిస్కోరాజా
డిస్కోరాజా

'రాజా ది గ్రేట్' తర్వాత వరుసగా మూడు ప్లాపులు మూటగట్టుకున్న మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'డిస్కో రాజా'. వి.ఐ ఆనంద్ దర్శకుడు. నభా నటేశ్, పాయల్ రాజ్​పుత్, తాన్యా హోప్ హీరోయిన్లు. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. కేవలం టీజర్లు మాత్రమే విడుదల చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన రవితేజ... 'డిస్కోరాజా'గా అలరించాడా? హ్యాట్రిక్ ప్లాపుల నుంచి బయటపడ్డాడా? లేదా అనేది ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

ఇదీ కథ

మద్రాసులో చిన్న చిన్న దొంగతనాల చేసే స్థాయి నుంచి గ్యాంగ్​స్టర్​గా ఎదుగుతాడు డిస్కోరాజా(రవితే‌జ‌). అక్కడే ఉన్న బర్మా సేతు(బాబీ సింహా‌) డిస్కోరాజాకు పోటీకి వస్తాడు. ఇద్దరి మధ్య గ్యాంగ్ వార్స్ జరుగుతుంటాయి. అప్పుడే డిస్కోరాజాకు అనాథ అయిన హెలెన్ (పాయల్ )తో పరిచయం ఏర్పడుతుంది. ఒకరికొకరు దగ్గరవుతారు. సేతుతో గొడవల వల్ల తన కొడుకు అనాథ కాకూడదని భావించిన డిస్కోరాజా హెలన్​తో లడఖ్ వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడా, డిస్కోరాజాపై దాడి జరుగుతుంది. అతడ్నిచంపేస్తారు. కానీ రీలైవ్ అనే బయోల్యాబ్ పరిశోధన వల్ల 35 ఏళ్ల తర్వాత డిస్కోరాజా మళ్లీ బతికొస్తాడు. అయితే తనకు పాత జ్ఞాపకాలేవీ గుర్తుండవు. వయసు పాతికేళ్లలానే కనిపిస్తుంటుంది. ల్యాబ్ నుంచి బయటపడ్డ డిస్కోరాజా తననెవరు చంపారో తెలుసుకునే ప్రయత్నంలో అతడికి ఎలాంటి నిజాలు తెలిశాయి? డిస్కోరాజాను చూసిన సేతు ఏం చేశాడు? నభా(నభా నటాషా‌)తో ఉన్న సంబంధమేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎలా ఉందంటే

డిస్కోరాజా... రవితేజ మాస్ ఇమేజ్​ను దృష్టిలో పెట్టుకొని అల్లిన కథ. 1980లో ఇద్దరు గ్యాంగ్ స్టర్​ల మధ్య జరిగిన సంఘటనలను సైన్స్​తో ముడిపెట్టి ప్రేక్షకులను అలరించేందుకు దర్శకుడు చేసిన కొత్త ప్రయోగం. కథ పరంగా పాత చింతకాయపచ్చడే అయినా... ఊహించని మలుపులతో కథనాన్ని ఆసక్తికరంగా మలిచి రవితేజ అభిమానులను ఫ్రీకౌట్ చేశాడు. లడఖ్​తో మొదలైన ఫస్టాప్​లో ప్రారంభ సన్నివేశాలతో భలే ఉందే అనిపించిన దర్శకుడు... ప్రకృతికి విరుద్దంగా జరిగే ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడ్ని బతికించినట్టుగానే.. మంచు కొండల్లో 35 ఏళ్లుగా నిర్జీవంగా పడి ఉన్న డిస్కోరాజాను బతికిస్తాడు. ఆ తర్వాత తానెవరో తెలుసుకునేందుకు బయల్దేరిన డిస్కోరాజాకు తన పేరేంటో తెలియడం, తనను ఎవరు చంపారో తెలుసుకొన్న తర్వాత ఫస్టాప్​ను ముగించాడు. సెకండాఫ్ కొచ్చేసరికి రివైండ్ బటన్ నొక్కాడు. ట్విస్ట్​ల మీద ట్విస్ట్​లిస్తూ కథనాన్ని నడిపించాడు. సేతుతో డిస్కోరాజాకున్న గొడవ, ఆ గొడవల్లో డిస్కోరాజా ఎలా చనిపోయాడో తెలుసుకునేందు ప్రేక్షకుడ్ని 1980లోకి తీసుకెళ్లాడు. కట్ చేస్తే 35 ఏళ్ల తర్వాత బతికొచ్చిన డిస్కోరాజాకు దిల్లీలో కనిపించకుండా పోయిన వాసు(రవితేజ) డిస్కోరాజా కొడుకనే విషయం తెలుస్తుంది. డిస్కోరాజాను నమ్మిన వ్యక్తులు ఎలా మోసం చేశారో చూపించడంతో కథను క్లైమాక్స్​కు చేర్చాడు.

ఎవరెలా చేశారు

రవితేజ.. గ్యాంగ్ స్టర్ డిస్కోరాజాగా, అమాయకుడైన వాసుగా రెండు లుక్స్​తో కనిపించి మెప్పించాడు. అలాగే బాబీ సింహా.. తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. సేతుగా సెటిల్డ్ ఫర్మామెన్స్​తో తెరపై విలనిజాన్ని చూపించాడు. కథానాయికలు నభా, పాయల్ పాత్రలు కొన్ని మాటలు, రెండు పాటలకే పరిమితమయ్యాయి. అలాగే రవితేజ గ్యాంగ్​లో నటించిన సునీల్ ఉత్తమ్ కుమార్​గా కీలక పాత్ర పోషించాడు. ఆ పాత్ర ఏంటీ, దానికున్న ప్రాధాన్యత ఏంటనేది సినిమాలో చూడాలి. దర్శకుడిగా వీఐ ఆనంద్ తనదైన ముద్ర కనిపిస్తుంది. తమన్ అందించిన నేపథ్య సంగీతం డిస్కోరాజాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్ఆర్​టీ ఎంటర్ టైన్​మెంట్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలం: రవితేజ, తమన్ నేపథ్య సంగీతం, క్లైమాక్స్

బలహీనత: కథ, నెమ్మదిగా సాగే కథనం

చివరగా: ఊహించని మలుపులతో మజా లేలో అంటోన్న 'డిస్కోరాజా'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY ONLY - TRANSCRIPT TO FOLLOW++
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 24 January 2020
++STARTS ON SOUNDBITE++
1. SOUNDBITE (English) Dr Chung Kin-lai, Hong Kong Hospital Authority Director (Quality and Safety):
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Dr Chung Kin-lai, Hong Kong Hospital Authority Director (Quality and Safety):
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Dr Chung Kin-lai, Hong Kong Hospital Authority Director (Quality and Safety):
++TRANSCRIPT TO FOLLOW++
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Hong Kong health officials on Thursday provided an update on a deadly new virus sweeping into the Chinese territory, saying they had concerns reports of symptoms were likely to rise.
Hospital Authority Director Dr Chung Kin-lai said during a media briefing Hong Kong's medical bed occupancy rate was at 97% and 5,000 people had attended A&E in relation to the virus.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 5:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.