ETV Bharat / sitara

రివ్యూ: కుటుంబంతో కలిసుంటే 'ప్రతిరోజూ పండగే'

author img

By

Published : Dec 20, 2019, 1:06 PM IST

మెగాహీరో సాయితేజ్ 'ప్రతిరోజూ పండగే' సినిమా.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.

ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ
సాయితేజ్-రాశీఖన్నా

చిత్రం: ప్రతిరోజూ పండగే
నటీనటులు: సాయితేజ్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్ తదితరులు
దర్శకుడు: మారుతి
సంగీతం: తమన్
నిర్మాణ సంస్థలు: యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్
విడుదల తేది: 2019 డిసెంబర్ 20

సాయితేజ, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'. సత్యరాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా.. ప్రేక్షకులకు నిజంగా పండగలా అనిపించిందా లేదా? తెలియాలంటే ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్లిపోదాం.

prathiroju pandage cinema
ప్రతిరోజూ పండగే సినిమాలోని ఓ సన్నివేశం

ఇదీ కథ:

రాజమండ్రిలో రఘురామయ్య(సత్యరాజ్) అనే రైతు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. అమెరికా, ఆస్ట్రేలియా, హైదరాబాద్​లో వారు స్థిరపడిపోయింటారు. ఎవరి ఉద్యోగాల్లో వారు తీరిక లేకుండా గడుపుతుంటారు. 70ఏళ్లు పైబడిన రఘురామయ్యకు ఉపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఇంకా ఐదు వారాల్లో చనిపోతాడని డాక్టర్లు చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న రఘురామయ్య కొడుకులు, కుమార్తె కుటుంబసమేతంగా తండ్రి దగ్గరకు వస్తారు. రఘురామయ్య చనిపోతే తదనంతర కార్యక్రమాలు చేసి తిరిగి వెళ్లిపోయేందుకు ఎదురుచూస్తుంటారు. కానీ రఘురామయ్య మనవడు సాయి(సాయితేజ)కి అది నచ్చదు. చివరి రోజుల్లో తాతను ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాడు. తాత చావు కోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులను ఎలా మార్చాడు, ఏంజిల్ ఆర్నాతో సాయికి ఉన్న సంబంధం ఏంటి? చివరి రఘురామయ్య ఏమయ్యాడు అనేదే ప్రతిరోజూ పండగే కథ.

prathi roju pandage team
ప్రతిరోజూ పండగే చిత్రబృందం

ఎలా ఉందంటే?

ఇది పాత కథే. అందరికి తెలిసిన కథే. ప్రతి ఇంట్లో జరిగే కథే అంటూ తన కథను మొదలుపెట్టిన దర్శకుడు మారుతి... తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని, తాత మనవళ్ల మధ్య అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించాడు. దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన తాత-మనవడు కథను గుర్తుచేస్తూ తన కథను అల్లుకుంటుపోయాడు. చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్న ఆత్రేయ మాటలను చూపించే ప్రయత్నం చేశాడు. ఓ వ్యక్తి చివరి దశలో ఉంటే అతడి కుటుంబం ఎలా ప్రవర్తించింది. దాని వెనుక కారణాలేంటో తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రథమార్థం రావురమేశ్- సాయితేజల మధ్య తండ్రి కొడుకులపై ఉన్న ప్రేమను, సత్యరాజ్- సాయితేజల మధ్య తాత మనవళ్ల మధ్య అనుబంధాన్ని చక్కటి వినోదంతో సాగుతుంది. ఆ తర్వాతే రెండో భాగంలో అసలు కథ మొదలవుతుంది. తండ్రి చనిపోకముందే ఆయనకు సమాధులు కట్టడం, అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయడం, తులసి నీళ్లు పోయడం వంటి అనాగరిక చర్యలకు పాల్పడుతుంటారు. వాటన్నింటి పిల్లల తప్పటడుగులుగా భావించిన తండ్రి.. ఓ నవ్వు నవ్వి ఊరుకుంటాడు. కానీ తాతంటే ఎంతో గౌరవమున్న మనవడు మాత్రం తమ తల్లిదండ్రులు చేసిన తప్పులను తెలియజేయడంతో ఈ కథను ముగించాడు. అయితే ఈ కథ ప్రస్తుత పరిస్థితులను అద్దంపడుతూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ద్వితియార్థం కథ సందేశాలిచ్చినట్లు కనిపించినా బయట జరుగుతుంది నూటికి నూరుపాళ్లు అదే అని చెప్పాలి. తల్లిదండ్రులను విడిచి విదేశాల్లో స్థిరపడిన కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడిన సందర్భాలు అనేకం చూశాం. పిల్లల మాటలకు నొచ్చుకొని తల్లిడిల్లిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. మెకానికల్ లైఫ్​లో బతుకుతున్న వారందరికి కనువిప్పు కలిగేలా ఆద్యంతం ఆసక్తిగా ప్రతీరోజూ పండగే సాగుతుంది.

satya raj-sai tej
సత్యరాజ్-హీరో సత్యరాజ్
saitej-raashi khanna
హీరోహీరోయిన్లు సాయితేజ్-రాశీఖన్నా

ఎవరెలా చేశారు?

ఈ కథకు ముగ్గురు ప్రాణం పోశారనే చెప్పాలి. సాయితేజ తన గత చిత్రాల కంటే మనవడి పాత్రలో చక్కగా ఒదిగిపోయి తనలోని ఎమోషనల్ నటుడు ఎలా ఉంటాడో చూపించాడు. అలాగే సాయితేజ తండ్రిగా రావు రమేశ్ నటన మరోసారి అద్భుతమని చెప్పాలి. డైనింగ్ టేబుల్ వద్ద రావు రమేశ్ చేసిన సీన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ థియేటర్​లో నవ్వులు పూయిస్తుంది. సాయికి తండ్రిగా, సత్యరాజ్​కు కొడుకుగా, ఓ కంపెనీ యజమానిగా మూడు పార్శ్వాల్లో నటిస్తూ కడుపుబ్బా నవ్వించాడు. తాతగా సత్యరాజ్ నటన పండింది. సాయితో కలిసి సత్యరాజ్ చేసే సందడి ఆకట్టుకుంటుంది. టిక్ టాక్ ఏంజిల్ ఆర్నాగా రాశీఖన్నా.. తన పాత్ర మేర ఫర్వాలేదనిపిస్తుంది.

'భలే భలే మగాడివోయ్' తర్వాత మారుతి.. మరో ఫ్యామిలీ ఎంటర్​టైనర్ ఇచ్చాడనడానికి ఈ చిత్రమే నిదర్శనం. ప్రేక్షకులు ఆశించిన రీతిలో వినోదాన్ని పంచుతూ కథను ముందుకు తీసుకెళ్లాడు. తనదైన మాటలు, సన్నివేశాలతో చక్కటి వినోదాన్ని, భావోద్వేగాలను పంచుతూ పిల్లలు ఎంత పెద్దవాళ్లయినా, తల్లిదండ్రులను మరిచిపోవద్దనే సత్యాన్ని వివరిస్తూ దర్శకుడిగా మరోసారి సఫలీకృతమయ్యాడు. జీఏటూ పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా సరిపోయాయి. సన్నివేశాలకు తగినట్లుగా తమన్ సమకూర్చిన సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది.

saitej in prathiroju pandage cinema
ప్రతిరోజూ పండగే సినిమాలో సాయితేజ్

బలాలుః
కథ
వినోదం
సాయితేజ
రావురమేశ్
సత్యరాజ్

బలహీనతలు:

ద్వితియార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలు

చివరకు: కుటుంబంతో ఆనందంగా ఉంటే ఆయుష్షు పెరుగుతుందని చాటి చెప్పిన చిత్రం 'ప్రతీరోజూ పండగే'.

గమనిక: ఈ సమీక్ష కేవలం సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది మాత్రమే. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.