ETV Bharat / sitara

Maestro Movie Review: నితిన్ 'మాస్ట్రో'.. ఎలా ఉందంటే?

ఓటీటీ వేదికగా విడుదలైన 'మాస్ట్రో'.. థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇంతకీ దీని కథేంటి? ఎవరెవరు ఎలా చేశారు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి.

nithin maestro movie telugu review
నితిన్ మాస్ట్రో మూవీ
author img

By

Published : Sep 17, 2021, 9:49 AM IST

చిత్రం: మాస్ట్రో; నటీనటులు: నితిన్‌, తమన్నా, నభా నటేశ్‌, జిషు సేన్‌ గుప్త, నరేశ్‌, శ్రీముఖి తదితరులు; సంగీతం: మహతి స్వర సాగర్‌; నిర్మాత: సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి; దర్శకత్వం: మేర్లపాక గాంధీ; బ్యానర్‌: శ్రేష్ఠ్‌ మూవీస్‌; విడుదల: డీస్నీ+హాట్‌స్టార్‌

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ నటుడు నితిన్‌. ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలతో అలరించిన ఆయన ముచ్చటగా మూడో చిత్రం 'మాస్ట్రో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'అంధాదున్‌' రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రలో నితిన్‌ ఎలా నటించారు? తెలుగు రీమేక్‌లో దర్శకుడు మేర్లపాక గాంధీ ఏ మార్పులు చేశారు?

.
.

కథేంటంటే: అరుణ్‌(నితిన్‌)కు 14ఏళ్ల వయసులో క్రికెట్‌ బాల్‌ తగలడం వల్ల కంటి చూపుపోతుంది. అయితే, అతనిలో ఉన్న టాలెంట్‌ ఏంటంటే పియానో చక్కగా వాయించడం. తన పియానో పాడైపోవడం వల్ల కొత్తది కొనుక్కోవాలని చూస్తాడు. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్‌లో అమ్మకానికి ఉన్న పియానో కొందామని వెళ్తాడు. అక్కడే ఆ రెస్టారెంట్‌ ఓనర్‌ కుమార్తె సోఫి(నభా నటేశ్‌)తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. అదే రెస్టారెంట్‌కు తరచూ వస్తుంటాడు ఒకప్పటి హీరో అయిన మోహన్‌(నరేశ్‌). అరుణ్‌లోని టాలెంట్‌ చూసి తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇంటికి వచ్చి పియానో వాయించమని చెబుతాడు. అరుణ్‌.. మోహన్‌ ఇంటికి వెళ్లే సరికి అతడు హత్యకు గురై ఉంటాడు? ఇంతకీ ఈ హత్య చేసిందెవరు? దీనికీ మోహన్‌ భార్య సిమ్రన్‌(తమన్నా), బాబీ(జిషు సేన్‌ గుప్త)లకు సంబంధం ఏంటి? అంధుడైన అరుణ్‌ ఆ హత్య విషయాన్ని పోలీసులకు చెప్పాడా? మోహన్‌ హత్య అనంతరం అరుణ్‌ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్‌ చేస్తున్నారంటే ప్రేక్షకులు కచ్చితంగా రెండు చిత్రాలకూ పోలిక పెడతారు. అందులో ఉన్నది.. ఇందులో లేనిది ఏంటని శూలశోధన చేస్తారు. బాలీవుడ్‌లో విజయవంతమైన 'అంధాదున్‌' తెలుగులో రీమేక్‌ చేస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత ఎలా తెరకెక్కిస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ విషయంలో దర్శకుడు మేర్లపాక గాంధీ నూరుశాతం విజయం సాధించారు. మాతృకలోని ఆత్మ ఏ మాత్రం చెడకుండా 'అంధాదున్‌'ను 'మాస్ట్రో'గా మలిచిన తీరు బాగుంది. అంధుడైన అరుణ్‌ డైలీ లైఫ్‌, పియానోపై అతనికున్న పట్టును చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఒక్కో సన్నివేశాన్ని అల్లుకుంటూ కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆయా సన్నివేశాలన్నీ సరదాగా సాగుతాయి. అంధుడైన అరుణ్‌ నటన నవ్వులు పూయించడం సహా అలరించేలా సాగుతుంది. నటుడు మోహన్‌ ఇంటికి అరుణ్‌ వెళ్లిన సమయానికి అప్పటికే అక్కడ హత్య జరిగి ఉండటం వల్ల కథ మలుపు తీసుకుంటుంది. అరుణ్‌ పరిస్థితి ఏంటో చూస్తున్న ప్రేక్షకుడికి ముందే తెలియడం వల్ల హత్య గురించి అతను పోలీసులకు ఎలా చెబుతాడు? చెప్పేందుకు చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతూనే నవ్వులు పంచుతాయి.

.
.

అరుణ్‌ అంధుడు కాదేమోనని, సిమ్రన్‌, పోలీస్‌ ఆఫీసర్‌ బాబీ చేసే ప్రయత్నాలు అలరిస్తాయి. విరామ సమయానికి సిమ్రన్‌ చేసిన పని కారణంగా అరుణ్‌కు ఒక విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది. దాని నుంచి అతడు ఎలా తప్పించుకుంటాడన్న అన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మరోవైపు అరుణ్‌ను చంపేందుకు బాబీ చేసే ప్రయత్నాలు, దాని నుంచి అతడు తప్పించుకోవడం తదితర సన్నివేశాలు ఆసక్తిగా సాగుతాయి. ఆ తర్వాత అరుణ్‌ గోవా వదలి వెళ్లిపోదామనుకుంటాడు. అక్కడి నుంచే కథనం కాస్త నెమ్మస్తుంది. అరుణ్‌, సిమ్రన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా సాగుతాయి. మళ్లీ పతాక సన్నివేశాల సమయానికి కథనం వేగం పుంజుకుంటుంది. చివరిలో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు. అదేంటనేది తెరపై చూడాలి. తెలుగు నేటివిటీకి అనుగుణంగా 'అంధాదున్‌' తీర్చిదిదిన విధానం బాగుంది. మీరు కనుక 'అంధాదున్‌' చూడకపోతే ఈ వీకెండ్‌లో 'మాస్ట్రో' ఓ మంచి థ్రిల్లింగ్‌ మూవీ చూసిన ఫీలింగ్‌ తప్పకుండా ఇస్తుంది.

ఎవరెలా చేశారంటే: బాలీవుడ్‌ ‘అంధాదున్‌’లో ఆయుష్మాన్‌ ఖురానా అంధుడి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడం సహ, నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. అదే పాత్రలో నితిన్‌ తెలుగులో చక్కగా చేశారు. ఆయుష్మాన్‌కు సమానంగా అంధుడి పాత్రలో నటించి మెప్పించాడు. ప్రథమార్ధమంతా సరదా సన్నివేశాలతో అంధుడిగా అలరించిన నితిన్‌, ద్వితీయార్ధానికి వచ్చే సరికి భావోద్వేగాలపరంగా చక్కటి హావభావాలు పలికించాడు. అరుణ్‌ పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. నితిన్‌కు ‘మాస్ట్రో’ ఓ విభిన్న చిత్రంగా నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది సిమ్రన్‌ పాత్ర పోషించిన తమన్నా గురించి. హిందీలో టబు ఈ రోల్‌ చేశారు. తెలుగులో తమన్నా కూడా చక్కగా నటించింది. రెండు భిన్న పార్శ్వాలను చూపించే ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనదైన నటన కనబరిచింది. ఇక జిషు సేన్‌ గుప్తా, నభా నటేశ్‌, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, అనన్య నాగళ్ల, హర్ష వర్దన్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. జిషు సేన్‌గుప్త పాత్రను ఇంకాస్త ఎస్టాబ్లిష్‌ చేయాల్సింది.

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అన్ని విభాగాలు చక్కని పనితీరు కనబరిచాయి. మహతి స్వర సాగర్‌ పాటలు పెద్దగా గుర్తుండవు కానీ, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాలో ప్రేక్షకుడిని లీనం చేసింది. యువరాజ్‌ సినిమాటోగ్రఫీ కూడా చక్కగా కుదిరింది. ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. అయితే, కరోనా నేపథ్యంలో అతి తక్కువ లొకేషన్లలోనే సినిమా పూర్తి చేశారు.. ఎస్‌.ఆర్‌.శేఖర్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. దర్శకుడు మేర్లపాక గాంధీ ‘అంధాదున్‌’ను ‘మాస్ట్రో’గా మలిచిన తీరు బాగుంది.. మాతృకలో పెద్దగా మార్పుల జోలికి పోలేదు. అలా చేసి ఉంటే అసలు కథ దెబ్బ తినేది. నటీనటుల నుంచి కూడా గాంధీ చక్కని నటన రాబట్టుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఓటీటీలో విడుదల చేశారు. కానీ, థియేటర్‌లో రిలీజ్‌ చేసి ఉంటే తప్పకుండా అలరించేది.

.
.

బలాలు

+ నితిన్‌, తమన్నా

+ ప్రథమార్ధం

+ సాంకేతిక విభాగం పనితీరు

బలహీనతలు

- ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

చివరిగా: 'అంధాదున్‌' పర్‌ఫెక్ట్‌ రీమేక్‌ 'మాస్ట్రో'.. థియేటర్‌ మూవీ!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.