ETV Bharat / sitara

Movie review: 'మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్' ఎలా ఉందంటే? - akhil new movie review

ప్రేమ, పెళ్లి నేపథ్య కథతో తీసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించింది. దర్శకుడు ఏం చెప్పారు? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

most eligible bachelor review telugu
'మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్' రివ్యూ
author img

By

Published : Oct 15, 2021, 3:03 PM IST

చిత్రం: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌; న‌టీన‌టులు: అఖిల్‌, పూజా హెగ్డే, ఆమ‌ని, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఈషా రెబ్బా, ఫ‌రియా అబ్దుల్లా, ముర‌ళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ ముర‌ళి, వి.జ‌య‌ప్ర‌కాష్, సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీను త‌దిత‌రులు; సంగీతం: గోపీ సుంద‌ర్‌; నిర్మాత‌: బ‌న్నీవాసు, వాసు వ‌ర్మ‌; స‌మ‌ర్ప‌ణ‌: అల్లు అర‌వింద్‌; ద‌ర్శ‌క‌త్వం: బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌; విడుద‌ల తేదీ: 15-10-2021

most eligible bachelor review telugu
'మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్' మూవీ

సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌లను.. వైవిధ్య‌భ‌రితంగా తెర‌పై ఆవిష్క‌రించి యువ‌త‌రం హృద‌యాల్ని కొల్ల‌గొట్టిన దర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌. కొత్త‌ద‌న‌మున్న ప్రేమ క‌థ‌ల‌ను ఆద‌రించ‌డంలో ముందుండే క‌థానాయ‌కుడు అఖిల్ అక్కినేని. ఇప్పుడీ ఇద్ద‌రి క‌ల‌యిక నుంచి వ‌చ్చిన ఓ న్యూఏజ్ ల‌వ్‌స్టోరీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'. పూజా హెగ్డే క‌థానాయిక‌. 'ఒంగోలు గిత్త' త‌ర్వాత 8 ఏళ్ల విరామం తీసుకుని భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ద‌స‌రా సంద‌ర్భంగా బాక్సాఫీస్ ముందుకొచ్చింది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డం సహా సినిమాకు కావాల్సినంత ప్ర‌చారం ద‌క్కింది. దీంతో సినీప్రియులు ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. మ‌రి ఆ అంచ‌నాల‌ను అఖిల్‌, పూజాల జోడీ అందుకుందా? బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చెప్పిన ప్రేమ‌క‌థ ప్రేక్ష‌కుల్ని ఏమేర మెప్పించింది? ఈ సినిమాతో ఆయ‌న హిట్ ట్రాక్ ఎక్కారా?లేదా?

క‌థేంటంటే: మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాల‌ని న‌మ్మే వ్య‌క్తి హ‌ర్ష (అఖిల్ అక్కినేని). అందుకు త‌గ్గ‌ట్లే అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ.. మ్యారేజ్ లైఫ్ కోసం ముందే అన్నీ ప‌క్కాగా సెట్ చేసుకుని పెట్టుకుంటాడు. పెళ్లి విష‌యంలో.. చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాల‌న్న విష‌యంలో త‌న‌కు చాలా స్ప‌ష్ట‌త ఉందని విశ్వ‌సిస్తుంటాడు హ‌ర్ష‌. త‌న‌పై త‌న‌కంత న‌మ్మ‌కం ఉంది కాబ‌ట్టే.. ముందే పెళ్లికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుని, అనుకున్న తేదీ క‌ల్లా ఓ మంచి అమ్మాయిని వెతికి ప‌ట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. 20మంది అమ్మాయిల్ని పెళ్లిచూపులు చూసి.. వాళ్ల‌లో మ‌న‌సుకు న‌చ్చిన ఆమెతో ఏడ‌డుగులు వేయాల‌న్న‌ది త‌న ప్ర‌ణాళిక‌. త‌నలా పెళ్లిచూపులు చూడాల‌నుకున్న అమ్మాయిల్లో స్టాండ‌ప్ క‌మెడియ‌న్ విభా అలియాస్ విభావ‌రి (పూజా హెగ్డే) ఉంటుంది. హ‌ర్షలాగే ఆమెకూ పెళ్లి విష‌యంలో.. రాబోయే జీవిత భాగ‌స్వామి విష‌యంలో కొన్ని అంచ‌నాలుంటాయి. అయితే ఆమెను పెళ్లి చూపులు చూడ‌క‌ముందే జాత‌కాలు క‌ల‌వ‌లేద‌న్న ఉద్దేశంతో హ‌ర్ష కుటుంబం.. ఆ సంబంధం కాద‌నుకుంటుంది. కానీ, హ‌ర్ష మాత్రం విభాను చూసి తొలిచూపులోనే మ‌న‌సు పారేసుకుంటాడు. ఆమెతోనే పెళ్లి పీట‌లెక్కాల‌ని క‌ల‌లు కంటాడు. అయితే విభా మాత్రం హ‌ర్ష ప్రేమ‌కు నో చెబుతుంది. ఈ క్ర‌మంలో పెళ్లి విష‌యంలో ఆమె అడిగిన కొన్ని ప్ర‌శ్న‌లు.. హ‌ర్ష జీవితంలో పెను మార్పుల‌కు కార‌ణ‌మ‌వుతాయి. మ‌రి ఆ ప్ర‌శ్న‌లేంటి? వాటికి స‌మాధానం క‌నుక్కునే క్ర‌మంలో హ‌ర్ష తెలుసుకున్న జీవిత‌ స‌త్య‌మేంటి? చివ‌రికి తాను అనుకున్న‌ట్లుగా విభా ప్రేమ‌ను ద‌క్కించుకున్నాడా? ఆమెతో పెళ్లి పీట‌లెక్కాడా? లేదా? అన్న‌ది తెర‌పై చూడాలి.

most eligible bachelor review telugu
'మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్' మూవీ

ఎలా ఉందంటే: నేప‌థ్యాలలో చిన్న చిన్న మార్పులుండొచ్చు గానీ ప్రేమ‌క‌థ‌ల‌న్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. ఎవ‌రైతే ఆ ప్రేమ‌క‌థ‌ను స‌రికొత్త కోణంలో తెర‌పై ఆవిష్క‌రించ‌గ‌లుగుతారో వాళ్లే ప్రేక్ష‌కుల మెప్పు పొంద‌గ‌లుగుతారు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ది అందెవేసిన చేయి. ఆయ‌న‌ చిత్రాల్లో ప్రేమ‌క‌థ‌ల‌న్నీ చిన్న లైన్‌తోనే ముడిప‌డి ఉంటాయి. కానీ, ఆ పాయింట్‌ను ఆయ‌న స‌రికొత్త ట్రీట్‌మెంట్‌తో చెప్పే తీరు సినీప్రియుల్ని మెప్పిస్తుంటుంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'నూ అలాంటి ఓ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న ఓ ఆస‌క్తిక‌ర క‌థాంశంతోనే రూపొందించారు భాస్క‌ర్‌. అయితే అది మ‌రీ సినిమాటిక్‌గా అనిపించినా.. ప్రేక్ష‌కులకు క‌నెక్ట్ అవుతుంది. ఆరంభంలో హ‌ర్ష పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన తీరు.. అత‌ని కోణం నుంచి క‌థ‌లోకి తీసుకెళ్లిన విధానం చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. ముందే పెళ్లికి ముహూర్తం పెట్టుకుని.. ఆ ముహూర్తం క‌ల్లా పెళ్లి కూతురును సెలెక్ట్ చేసుకోవాల‌నుకోవ‌డం.. ఇందుకోసం వ‌రుస‌గా పెళ్లి చూపుల‌కు వెళ్ల‌డం.. ఈ క్ర‌మంలో ఒకొక్క‌రి నుంచి అత‌నికెదుర్యే అనుభ‌వాల‌తో క‌థ‌నం స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంటుంది. విభా పాత్ర సీన్‌లోకి వ‌చ్చాక క‌థ‌లో వేగం పెరుగుతుంది. ఆమె ప‌రిచ‌యం అయ్యాక.. హ‌ర్ష‌తో వ‌చ్చే ఎపిసోడ్లు.. పెళ్లికి కావాల్సిన అర్హ‌త‌లేంటి? అంటూ ఆమె వేసే ప్ర‌శ్న‌లు.. ఆ ప్ర‌శ్న‌లకు స‌మాధానం రాబ‌ట్టే క్ర‌మంలో అత‌ను ప‌డే ఇబ్బందులు ఆస‌క్తిక‌రంగా సాగుతూనే న‌వ్వుల పూయిస్తుంటాయి. విరామానికి ముందు వ‌చ్చే కోర్టు సీన్ లాజిక్‌కు దూరంగా అనిపించినా.. ఆ ఎపిసోడ్‌లో పోసాని కృష్ణ ముర‌ళి చేసే హంగామా మంచి కాల‌క్షేపాన్ని అందిస్తుంది. ఇక విరామ స‌మ‌యానికి విభాకు హ‌ర్ష దూరం కావాల్సి రావ‌డం వల్ల ద్వితియార్థం ఏం జ‌ర‌గుతుందా? అన్న ఆస‌క్తి క‌లుగుతుంది.

అయితే ప్ర‌ధ‌మార్థంలో ఉన్న మెరుపు ద్వితియార్థంలో ఆరంభం నుంచే మిస్సైన‌ట్లు అనిపిస్తుంది. పెళ్లికి అస‌లైన ఎలిజిబులిటి ఏంటి? అన్న‌ది చెప్ప‌డం కోసం ద్వితియార్థంలో భాస్క‌ర్ రాసుకున్న కొన్ని ఎపిసోడ్లు బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్లుగా ఉంటాయి. విభా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం క‌నుక్కునే క్ర‌మంలో హ‌ర్ష త‌న‌ను తాను తెలుసుకోవడం.. ఆమెను త‌న ప్రేమ‌తో మెప్పించ‌డం కోసం అత‌ను చేసే ప్ర‌య‌త్నాలు ఆక‌ట్టుకునేలా సాగుతాయి. అయితే ప్రేమ‌కు.. రొమాన్స్‌కు మ‌ధ్య తేడాని స‌రైన రీతిలో వివ‌రించి చెప్ప‌డంలో ఆఖ‌ర్లో భాస్క‌ర్ త‌డ‌బ‌డ్డాడు. క్లైమాక్స్‌లో విభా, హ‌ర్ష చెప్పే సంభాష‌ణ‌లు మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటాయి. అయితే ఈ ముగింపు చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ 'బొమ్మ‌రిల్లు' చిత్ర‌మే మ‌దిలో మెదులుతుంది.

most eligible bachelor review telugu
అఖిల్ పూజా హెగ్డే

ఎవ‌రెలా చేశారంటే: హ‌ర్ష‌గా అఖిల్‌.. స్టాండప్ క‌మెడియ‌న్ విభాగా పూజా హెగ్డే.. త‌మ త‌మ పాత్ర‌ల్లో ఎంతో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ముఖ్యంగా పూజా త‌న గ్లామ‌ర్‌తో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసింది. రొమాంటిక్ స‌న్నివేశాల్లో అఖిల్‌, పూజాల జోడీ ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపించింది. ముర‌ళీ శ‌ర్మ‌, ఆమ‌ని, జ‌య‌ప్ర‌కాష్ పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి. ప్ర‌ధ‌మార్థంలో సుడిగాలి సుధీర్‌.. పోసాని కృష్ణ‌ముర‌ళి, ద్వితియార్థంలో వెన్నెల కిషోర్ త‌మ‌వంతు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. ఈషా రెబ్బా, ఫ‌రియా అబ్దుల్లా, నేహా శెట్టి వంటి నాయిక‌ల్ని అతిథి పాత్ర‌ల్లో ఉప‌యోగించుకున్న తీరు బాగుంది. భాస్క‌ర్ ప్ర‌ధమార్థంపై చూపిన ప‌ట్టును.. ద్వితియార్థంలో చూపించ‌లేక‌పోయారు. క్లైమాక్స్ విష‌యంలో ఏమాత్రం కొత్త‌ద‌నం చూపించ‌లేక‌పోయారు. లెహ‌రాయి, గుచ్చే గులాబిలాగా పాట‌లు ఎంతో విన‌సొంపుగా ఉన్నాయో.. వాటి పిక్చ‌రైజేష‌న్ కూడా అంతే ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. గోపీ సుంద‌ర్ సంగీతం, ప్ర‌దీశ్ వ‌ర్మ ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకు మ‌రింత బ‌లాన్నిచ్చాయి.

బ‌లాలు

+ అఖిల్‌, పూజాల జోడీ

+ ప్ర‌ధ‌మార్ధం

+ పాట‌లు

బ‌ల‌హీన‌త‌లు

- ద్వితీయార్ధం

- క్లైమాక్స్‌

చివ‌రిగా: కాల‌క్షేపాన్నిచ్చే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.