ETV Bharat / sitara

కీర్తి సురేశ్​ 'మిస్‌ ఇండియా' రివ్యూ

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు అంటే.. అయితే పోలీసు కథలు లేదంటే జీవిత కథలు. కానీ సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి... ప్రఖ్యాత వ్యాపారవేత్తగా ఎలా మారిందంటూ చూపించే తరహా కథలు పెద్దగా రాలేదు. 'మిస్‌ ఇండియా'తో అలాంటి ప్రయత్నమే చేశారు దర్శకుడు నరేంద్ర నాథ్‌. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో మీరే చదివేయండి!

keerthy suresh new movie miss india review
'మిస్‌ ఇండియా' రివ్యూ: ఓ అమ్మాయి లక్ష్యసాధన
author img

By

Published : Nov 4, 2020, 9:22 AM IST

మిస్​ ఇండియా.. టైటిల్‌ చూసి ఇదేదో అందాల పోటీల నేపథ్యంలో రూపొందిన సినిమా అనుకోవద్దు. 'జీవితంలో లక్ష్యం పెట్టుకోవాలి... దాన్ని సాధించడానికి ఎంతవరకైనా పోరాడాలి' అని నిరూపించే కథ ఇది.

చిత్రం: మిస్‌ ఇండియా

సంస్థ‌: ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌

న‌టీన‌టులు: కీర్తి సురేశ్‌, జగపతిబాబు, సుమంత్‌ శైలేంద్ర, నవీన్‌చంద్ర, నదియ, నరేశ్‌, కమల్‌ కామరాజు, రాజేంద్రప్రసాద్‌, పూజిత పొన్నాడ, దివ్య శ్రీపాద తదితరులు

కళ: సాహి సురేష్‌

పాటలు: కళ్యాణ్‌ చక్రవర్తి, నీరజ కోన

రచన: నరేంద్రనాథ్‌, తరుణ్‌ కుమార్

కూర్పు: తమ్మిరాజు

ఛాయగ్రహణం: సుజిత్‌ వాసుదేవ్‌

సంగీతం: తమన్

నిర్మాత: మహేష్‌ కోనేరు

దర్శకుడు: నరేంద్ర నాథ్‌

విడుద‌ల‌: 04 నవంబర్‌ 2020 (‘నెట్‌ఫ్లిక్స్‌’లో)

కథేంటంటే..

మానస సంయుక్త (కీర్తి సురేశ్‌) చిన్నప్పటి నుంచి పెద్ద వ్యాపారవేత్త అవ్వాలని అనుకుంటుంది. ఎంబీఏ పూర్తి చేసి బిజినెస్‌ స్టార్ట్‌ చేసి తనేంటో ప్రపంచానికి చూపించాలనేది ఆమె కల. ఆమె అనుకున్నట్లే పెద్ద వ్యాపారవేత్త అవుతుంది. అయితే అది ఇండియాలో కాదు... అమెరికాలో. తన తాత విశ్వనాథ శాస్త్రి (రాజేంద్రప్రసాద్‌) నుంచి నేర్చుకున్న హెర్బల్‌ టీ తయారీని వ్యాపారంగా ఎంచుకొని ది బెస్ట్‌ అనిపించుకుంటుంది. అసలు సంయుక్త అమెరికా ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వ్యాపారవేత్త అయ్యింది, తను అనుకున్నది ఎలా సాధించింది. ఆమె ప్రయాణంలో విజయ్‌ (నవీన్‌ చంద్ర), సుమంత్‌ శైలేంద్ర (విక్రమ్‌), కైలాష్‌ శివ కుమార్‌ (జగపతిబాబు) పాత్రలు ఏంటి.. అనేదే కథ.

keerthy suresh new movie miss india review
మిస్‌ ఇండియా సినిమాలోని ఓ సన్నివేశం

ఎలా ఉందంటే..

'నేను గొప్పదానిని కావడం కాదు... నువ్వెంత గొప్పోడివో అందరికీ తెలిసేలా చేస్తా' సినిమా ప్రారంభంలో తాతతో మానస సంయుక్తతో చెప్పిన ఈ డైలాగ్‌ చుట్టూనే ఈ సినిమా సాగుతుంది. దానికి అనుబంధంగా జరిగే ప్లాట్‌ 'నచ్చిన పనిలో నచ్చింది చేసి.. ఏదైనా సాధించడం' అనే సంయుక్త ధ్యేయం. వీటిని ఆమె ఎలా సాధించిందో సినిమా. మహిళా సాధికారత అనే అంశం అంతర్లీనంగా సాగే ఈ సినిమా ఆద్యంతం ఆహ్లాదంగా సాగుతుంది. సంయుక్త వ్యాపారవేత్తగా ఎదుగుతున్నప్పుడు సినిమా కూల్‌గా సాగుతున్న సమయంలో కూల్‌గా సాగిపోతున్నట్లు కనిపించినా... వ్యాపారంలో తొలి దెబ్బ తగిలాక సినిమాలో వేగం పెరుగుతుంది. అది ఆకట్టుకుంటుంది కూడా. సినిమాను టైట్‌గా తీసుకొచ్చినా... బిజినెస్‌లో ఇంకొంచెం ట్విస్ట్‌లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..

జాతీయ ఉత్తమ నటి పురస్కార గ్రహీత కీర్తి సురేశ్‌ తనెందుకు ఉత్తమ నటో మరోసారి నిరూపించింది. సాధారణ అమ్మాయిగా సెటిల్డ్‌గా స్టార్ట్‌ అయ్యి... వ్యాపారవేత్తగా మారుతున్న క్రమంలో ఆమెలో కనిపించిన కసి, అనుకున్నది సాధించాక ఆమె చూపించిన నటన ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే తనకు కొట్టినపిండి అయిన ధనవంతుడైన విలన్‌ పాత్రలో జగపతిబాబు అలరించాడు. మిగిలిన పాత్రల్లో ఎవరికి వారు చక్కగా నటించారు. సుమంత్‌ శైలేంద్ర, నవీన్‌ చంద్ర, నరేష్‌, నదియ, కమల్‌ కామరాజు తమ పరిధి మేర చక్కగా నటించారు. ముగింపు విషయంలో ఇంకొంచెం కథనం బిగువుగా రాసుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సన్న బడ్డ కీర్తి ముఖం అంతగా ఆకర్షణీయంగా కనిపించలేదు. వినోదం లేకపోవడం కాస్త లోటుగా అనిపించే విషయమే.

చక్కగా తెరకెక్కించారు..

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఇద్దరి గురించి... ఒకరు ఛాయాగ్రాహకుడు సుజిత్‌ వాసుదేవ్‌, మరొకరు రచయితలు నరేంద్ర నాథ్‌, తరుణ్‌ కుమార్‌. అమెరికా అందాలు చూపించడంలో సుజిత్‌ పనినతం వావ్‌ అనిపిస్తుంది. సినిమా ప్రారంభంలో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ చూపించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మహిళా సాధికారత నేపథ్యంలో రాసుకున్న కథను నరేంద్ర నాథ్‌ చక్కగా తెరకెక్కించారు. దానికి తరుణ్‌ కుమార్‌తో కలసి రాసుకున్న సంభాషణలు అదనపు సొబగులద్దాయనే చెప్పాలి. తమన్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. మరీ రణగొణ ధ్వనులు లేకుండా స్మూత్‌గా కానిచ్చేశారు.

పెన్‌ పవర్‌ను చూపించే డైలాగ్స్​తో

'గొప్పతనం అనేది ఒక లక్షణం... అది ఒకరు గుర్తించడం వల్ల రాదు.. ఒకరు గుర్తించకపోవడం వల్ల పోదు. ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు... ఎంత ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం. కాంప్రమైజ్‌ అనేది మనల్ని ప్రతి రోజు పలకరించే క్లోజ్‌ ఫ్రెండ్‌, అబద్దం అనేది మన పక్కనే ఉండే నెయిబర్‌, అడ్జస్ట్‌మెంట్‌ అనేది మనల్ని వదలని లవర్‌.' డైలాగ్స్‌ సినిమా థీమ్‌ని చెబుతాయి. అలాగే రచయితల పెన్‌ పవర్‌ను కూడా వినిపిస్తాయి. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓటీటీ సినిమాలు అంటే రెండు గంటలలోపే నిడివి ఉండాలి అని అంటుంటారు. ఈ సినిమా రెండు గంటలకుపైనే ఉంది. అయినా అది పెద్ద ఇబ్బంది పెట్టే అంశం కూడా కాదు.

బలాలు

  • సినిమా కథాంశం
  • కీర్తి సురేశ్‌ నటన
  • సంభాషణలు

బలహీనతలు

  • వినోదం లేమి
  • చప్పగా ముగిసిన విధానం

చివరిగా: 'మిస్‌ ఇండియా' సినిమా మాత్రమే కాదు ఓ బ్రాండ్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఇదీ చూడండి:ముగ్గురు భామలతో చైతూ సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.