ETV Bharat / sitara

రివ్యూ: 'డర్టీ హరి' చివరకు ఏం చేశాడు? - DIRTY HARI latest reviews

ఏటీటీలో విడుదలైన 'డర్టీ హరి' సినిమా ఎలా ఉంది? హీరోహీరోయిన్లు తమ నటనతో మెప్పించారా? దర్శకుడిగా ఎమ్.ఎస్ రాజు విజయం సాధించారా? అనే విషయాలను ఈటీవీ భారత్ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

DIRTY HARI MOVIE TELUGU REVIEW
రివ్యూ: 'డర్టీ హరి' చివరకు ఏం చేశాడు?
author img

By

Published : Dec 19, 2020, 5:03 PM IST

చిత్రం: డ‌ర్టీ హ‌రి

న‌టీన‌టులు: శ్రవణ్‌రెడ్డి, రుహానీశ‌ర్మ‌, సిమ్రత్‌ కౌర్‌ త‌దిత‌రులు

నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్

స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎం.ఎస్.రాజు

సంస్థ‌: ఎస్‌.పి.జె.క్రియేష‌న్స్‌

విడుద‌ల‌: 18-12-2020 (ఫ్రైడే మూవీస్ ఓటీటీ)

లాక్‌డౌన్ త‌ర్వాత ఓటీటీలు, ఏటీటీలే సినీ వినోదాన్ని పంచుతున్నాయి. ఈ వేదిక‌ల ద్వారా త‌ర‌చూ కొత్త సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఈ వారాంతంలో ఫ్రైడే మూవీస్ అనే కొత్త ఓటీటీ వేదిక ద్వారా 'డ‌ర్టీ హ‌రి' విడుద‌లైంది. ప్రముఖ నిర్మాత ఎమ్‌.ఎస్‌.రాజు దర్శకత్వం వ‌హించ‌డం.. ప్రచార చిత్రాలు ఆక‌ర్షించేలా ఉండ‌టం వల్ల ఈ సినిమా గురించి సినీ అభిమానులు ప్రత్యేకంగా ఎదురు చూశారు. మ‌రి చిత్రం ఎలా ఉంది? ఇంతకీ ఈ 'డర్టీ హరి' ఎవరు?

DIRTY HARI MOVIE TELUGU REVIEW
'డర్టీ హరి' సినిమాలోని సన్నివేశం

క‌థేంటంటే:

హ‌రి (శ్రవణ్‌ రెడ్డి)ఏదైనా సాధించాల‌నే ఒక ఆశ‌యం క‌లిగిన యువ‌కుడు. ఉద్యోగం కోసం న‌గరానికి చేరుకుంటాడు. అత‌ను ధ‌నవంతుల కుటుంబానికి చెందిన వ‌సుధ (రుహానీ శ‌ర్మ‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ ప్రేమ కాస్త పెళ్లి వ‌ర‌కు వెళుతుంది. ఇంత‌లో వ‌సుధ సోద‌రుడి ప్రియురాలైన జాస్మిన్ (సిమ్రత్‌ కౌర్‌)ను చూసి ఆకర్షణకు గుర‌వుతాడు. క‌థానాయిక కావాల‌నే ఆశ‌యం క‌లిగిన జాస్మిన్ కూడా హ‌రికి చేరువ‌వుతుంది. ఈ బంధం వ‌ల్ల జాస్మిన్ గర్భవతి అవుతుంది. ధ‌న‌వంతురాలైన వ‌సుధ నుంచి విడిపోవ‌డానికి ఇష్టపడలేక‌, ఇటు గర్భవతి అయిన జాస్మిన్ బంధంలోనూ ఇరుక్కుపోయిన హ‌రి ఏం చేశాడు? ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరగాయనేది కథ.

ఎలా ఉందంటే:

థ్రిల్లింగ్ అంశాల‌తో కూడిన ఎరోటిక్ చిత్రమిది. తొలి భాగం స‌న్నివేశాలు యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకునేలా ఉంటాయి. మ‌లిభాగంలో మ‌లుపులు, ముఖ్యంగా ప‌తాక స‌న్నివేశాలు స‌గ‌టు ప్రేక్షకుడిని ర‌క్తిక‌ట్టిస్తాయి. ఈ క‌థ‌కు ల‌క్ష్య ప్రేక్షకులు ఎవ‌ర‌నే విష‌యంపై దర్శకుడు ఎక్కువ‌గా దృష్టిపెట్టాడు. నిజానికి ఈ క‌థ‌లో యువ‌తరాన్ని ఆక‌ర్షించే శృంగార భ‌రిత‌మైన అంశాల‌తోపాటు.. థ్రిల్లింగ్ అంశాలకూ చోటుంది. కానీ దర్శకుడు యువ‌త‌రం ప్రేక్షకులను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం వల్ల శృంగార భ‌రిత‌మైన స‌న్నివేశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. చివ‌రి 20 నిమిషాలు మాత్రం ఈ క‌థ‌లోని రెండో కోణం క‌నిపిస్తుంది. ఎమ్‌.ఎస్‌.రాజు యువ‌త‌రం ఆలోచ‌న‌ల‌కు తగ్గట్టు క‌థను అల్లుకున్న విధానం మెప్పిస్తుంది. ఎరోటిక్ స‌న్నివేశాల్ని తీసిన విధానం, అక్కడక్కడా మ‌లుపులు మెప్పిస్తాయి. కానీ, క‌థ‌లో బిగి మాత్రం క‌నిపించ‌దు. తొలి భాగం స‌న్నివేశాలు హ‌రి పాత్రకు అనువుగా సాగుతుంటాయి. అలా సిటీకి రావ‌డం, ఆ వెంట‌నే ధ‌నవంతురాలైన అమ్మాయిని ప్రేమించ‌డం.. ఇలా అన్నీ సినిమాటిక్‌గా సాగిపోతుంటాయి. జాస్మిన్ పాత్రతో ప్రేమ‌లో ప‌డిన విధానం కూడా అంతే. దాంతో చాలా వ‌ర‌కు స‌న్నివేశాలు ప్రేక్షకుడి ఊహ‌కు తగ్గట్టుగానే సాగుతున్నట్టు అనిపిస్తాయి. ద్వితీయార్ధం సినిమాకు ప్రధాన‌బ‌లం. హ‌త్య వెన‌క మిస్టరీ, అజ‌య్ పాత్ర ప‌రిచ‌యం, హ‌రి - సిమ్రత్‌కౌర్‌ల మ‌ధ్య స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉంటాయి. హ‌త్య కేసు మిస్టరీ ప‌రిధిపై ఇంకాస్త దృష్టిపెట్టుంటే సినిమా మ‌రింత థ్రిల్‌ని పంచేది.

DIRTY HARI MOVIE TELUGU REVIEW
డర్టీ హరి తెలుగు సమీక్ష

ఎవ‌రెలా చేశారంటే?:

హ‌రి పాత్రలో శ్రవణ్‌రెడ్డి మెప్పిస్తాడు. ప‌లు స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. సిమ్రత్‌ కౌర్ బోల్డ్ పాత్రతో కుర్రకారుని ఆక‌ర్షించింది. పాత్రకు తగ్గట్టుగా క‌నిపించ‌డమే కాదు, క‌థానాయిక కావాల‌నే ఒక ఆశ‌యం క‌లిగిన యువ‌తిగా ఆమె ప్రద‌ర్శించిన అభిన‌యం కూడా ఆక‌ట్టుకుంటుంది. ద్వితీయార్ధంలోకి వ‌చ్చేస‌రికి ఆమె ఆశ‌యం పక్కదారి పట్టడంతో, పాత్ర ఔచిత్యం కోల్పోయిన‌ట్టు అనిపిస్తుంది. రుహానీ శ‌ర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌గ‌టు యువ‌తి పాత్రలో క‌నిపిస్తుంది. నిజానికి ఆమె పాత్రలో బ‌లం లేదు. కానీ రుహాని ఆ కాస్త పరిధిలోనే త‌న ముఖ క‌వ‌ళిక‌లు, అభిన‌యంతో త‌న ముద్ర ప్రదర్శించేలా చేసింది. అజ‌య్ పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా ఉన్నంత‌లో అల‌రిస్తాడు. రుహానీ త‌ల్లిగా సురేఖావాణి తన పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించింది. సాంకేతికంగా సినిమా బాగుంది. ఛాయాగ్రహణం, సంగీతం, ఎడిటింగ్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. దర్శకుడుఎమ్‌.ఎస్‌.రాజు ఎరోటిక్ స‌న్నివేశాల్ని హ‌ద్దులు దాట‌కుండా తీసిన విధానం మెప్పిస్తుంది.

DIRTY HARI MOVIE TELUGU REVIEW
డర్టీ హరి తెలుగు సమీక్ష

బ‌లాలు

  • క‌థ‌
  • యువ‌త‌రాన్ని మెప్పించే అంశాలు
  • ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

  • ప్రేక్షకుడి అంచ‌నాల‌కు తగ్గట్టు సాగే ప్రధమార్ధం
  • థ్రిల్లింగ్ అంశాలు కొర‌వ‌డ‌టం

చివ‌రిగా: యువతరమే లక్ష్యంగా 'డ‌ర్టీ హ‌రి'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.