ETV Bharat / sitara

సమీక్ష: 47 రోజుల్లో ఏం జరిగింది? - సత్యదేవ్ 47 డేస్

సత్యదేవ్​ ప్రధాన పాత్రలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్​ థ్రిల్లర్​గా తెరకెక్కిన చిత్రం '47 డేస్'. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

47 days movie review
47 రోజుల్లో ఏం జరిగింది
author img

By

Published : Jul 2, 2020, 11:49 AM IST

చిత్రం: 47 డేస్‌

నటీనటులు: సత్యదేవ్‌, రోషిణి, పూజా ఝవేరి, రవివర్మ, సత్య ప్రకాశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ముక్తార్‌ ఖాన్‌ తదితరులు

సంగీతం: రఘు కుంచె

సినిమాటోగ్రఫీ: జీకే

ఎడిటింగ్‌: ఎస్‌ఆర్‌ శేఖర్‌

నిర్మాత: విజయ్‌ డొంకాడ, శ్రీధర్‌ మక్కువ, రఘు కుంచె, శశి డబ్బర

రచన, దర్శకత్వం: ప్రదీప్‌ మద్దాళి

బ్యానర్‌: టైటిల్‌ కార్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

విడుదల: జీ5 తెలుగు

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోల సినిమాల తర్వాత... అంతగా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న జోనర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. సినిమా మొదటి సీన్‌లో మొదలయ్యే సస్పెన్స్‌ ఆఖరి సీన్‌లో రివీల్‌ చేసే సినిమాలంటే ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ యాప్‌ల హవా మొదలయ్యాక ఇలాంటి చిత్రాలపై ఆసక్తి మరింత పెరిగింది. ఇతర భాషల్లో తెరకెక్కిన ఈ తరహా సినిమాలను సబ్‌టైటిల్స్‌తో చూసేస్తున్నారు. అలాంటి సమయంలో ఓటీటీలోకి వచ్చిన చిత్రం '47 డేస్‌'. నిజానికి ఈ సినిమా గతేడాదే థియేటర్లలో విడుదల కావాల్సింది. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ పడుతూ... కొవిడ్‌ కారణంగా ఓటీటీకి వచ్చేసింది. 47 రోజుల్లో ఏం జరిగింది అంటూ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తిరేపిన ఈ సినిమా ఎలా ఉందంటే?

47 days movie review
47 డేస్‌

కథేంటంటే:

ఏసీపీ సత్యదేవ్‌ అలియాస్‌ సత్య (సత్యదేవ్‌) విధుల్లో చేరిన తొలి నాళ్లలోనే డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. విశాఖపట్నం నగరంలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకొని శభాష్‌ అనిపించుకుంటాడు. ఆ క్రమంలో ముఠా ప్రధాన నాయకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమై ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అవుతాడు. దానికి కారణం అతని భార్య పద్మిని (రోషిణి ప్రకాశ్‌). ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు పద్మిని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ గతాన్ని మర్చిపోలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆమె ఆత్మహత్యకు, నగరంలో జరిగిన ఓ వ్యాపారవేత్త ఆత్మహత్యకు సంబంధం ఉన్నట్లు గ్రహిస్తాడు. దీంతో వాటిని ఛేదించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ కేసుతో ఎవరెవరికి సంబంధం ఉంది? అసలు ఆ రెండూ ఆత్మహత్యలేనా అనేది సినిమా కథ. హీరో విచారణలో భాగంగా కలుసుకున్న క్రిస్టినా అలియాస్‌ జూలియట్‌ (పూజా ఝవేరి), సత్య స్నేహితుడు రవి (రవి వర్మ), ఏఎస్‌ఐ రాజారాం (శ్రీకాంత్‌ అయ్యంగార్‌)కి ఈ కేసుతో సంబంధం ఏంటి అనేది సినిమాలో చూడాల్సిందే.

47 days movie review
47 డేస్‌

ఎలా ఉందంటే:

క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలంటే ప్రేక్షకుడు ఆశించేది సీట్‌ ఎడ్జ్‌ ఎక్స్‌పీరియన్స్‌. తర్వాత ఏం జరుగుతుంది? హీరో ఏం చేస్తాడు? విలన్‌ అతనేనా? అసలు ఎంత మంది విలన్లు? అనే ప్రశ్నలు మెదడును తొలిచేయాలి. అప్పుడు వావ్‌ ఏముందిరా సినిమా అనుకుంటారు. '47 డేస్‌'లో తొలి రోజు మొదలైనప్పుడు అలాంటి ఫీలింగే కలుగుతుంది. కానీ సినిమాలో రోజులు ఎంత త్వరగా తిరిగిపోయినట్లు చూపిస్తారో... ప్రేక్షకుడి ఫీలింగ్‌ కూడా అంత త్వరగా మారిపోతుంది. ఆత్మహత్యనా? హత్యనా అంటూ మొదలైన సినిమా... ఏమైతే ఏముందిలే అనే స్థాయికి వెళ్తుంది. కారణం సినిమా ట్యాగ్‌లైన్‌లో ఉన్న మిస్టరీ అన్‌ఫోల్డ్‌.. సినిమాలో పర్‌ఫెక్ట్‌గా అవ్వకపోవడం.

ఇంటర్వెల్‌ సమయానికి కథలో చాలా ముడులు వేసిన దర్శకుడు... తర్వాత సరిగ్గా విప్పలేకపోయాడు. దీంతో సినిమా ఆఖరికి విసుగు వచ్చేస్తుంది. మాదకద్రవ్యాల ముఠా వెనుక పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారంటూ ఆసక్తి రేకెత్తించి చివరికి చప్పగా ముగించేశారు. అలాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలకు ట్విస్ట్‌లు చాలా కీలకం. సీన్‌ సీన్‌కి కాకపోయినా.. పది సీన్లకైనా ట్విస్టులు ఉండాలి. ఇవి సినిమాలో అంతగా లేవనే చెప్పాలి. సినిమాకు 47 రోజులు అని పేరు పెట్టి.. జస్టిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఆ పేరుకు సినిమాకు సంబంధం లేదు. సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌లో ఇలాంటివి చాలా కీలకం. ఏదో 47 రోజులు అన్నాం కదా అన్నట్లు... రోజు మారినప్పుడల్లా పదేసి, ఇరవయ్యేసి పేజీలు తిప్పేసి చూపించారు. ఆఖరిగా సత్యదేవ్‌ లాంటి యాక్టర్‌ నుంచి దర్శకుడు ఇంకొంత 'వావ్‌' ఎలిమెంట్‌ను తీసుకోవచ్చు అనిపించింది.

47 days movie review
47 డేస్‌

ఎవరెలా చేశారంటే:

సినిమాలో చాలా పాత్రలు కనిపించినా... బాగా గుర్తుండిపోయే పాత్ర సత్యదేవ్‌. ఎప్పటిలాగే తనదైన శైలిలో సత్యదేవ్‌ అలరించాడు. పోలీసుగా విచారణ చేస్తున్న సన్నివేశాల్లో ఎంతగా మెప్పించాడో, ప్రేమికుడిగా దూరమైన ప్రేయసి కోసం పడే వేదనను కళ్లలో అంత బాగా పలికించాడు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది శ్రీకాంత్‌ అయ్యంగార్‌ గురించి. సినిమా మొదట్లో సమాజంలో ఏమీ చేయలేకపోతున్నానంటూ బాధపడే పోలీసుగా కనిపించి ఆకట్టుకున్నాడు. అదే ఆఖర్లో కీలకంగా మారి చక్కటి వేరియేషన్‌ చూపించాడు. రోషిణి ప్రకాశ్‌, పూజా ఝవేరి, రవివర్మ, సత్య ప్రకాశ్‌లు తమ పరిధి మేర నటించారు. ఇక మిగిలిన పాత్రలకు పెద్దగా నటించి మెప్పించే ఆస్కారం లేదు.

సాంకేతిక అంశాలు..

ఇలాంటి సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌కు ప్రాణం సంగీతం. పాటలు ఉండే అవకాశం చాలా తక్కువ కాబట్టి అయితే మాంటేజ్‌ సాంగ్స్‌లోనో, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లోనో సంగీత దర్శకుడు తన మార్కు చూపించాలి. ఈ విషయంలో రఘు కుంచె ఆశించినమేర ఆకట్టుకోలేకపోయాడు. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే... పెద్దగా ఇంట్రెస్టింగ్‌ షాట్స్‌ ఏమీ లేవు. అయితే సినిమాటోగ్రాఫర్‌ జీకే విశాఖపట్నం అందాలను మాత్రం చక్కగా కెమెరాలో బంధించాడు. సినిమాలో కొన్ని సీన్లకు కత్తెరేయొచ్చు. ఇక ఆఖరుగా కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ ప్రదీప్‌ మద్దాళి గురించి చూసుకుంటే.. ఎంచుకున్న అంశం ఆసక్తికరమైనదే అయినా.. దాన్ని అంత పక్కాగా తెరకెక్కించలేకపోయాడని చెప్పాలి. సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌లో ముడి ఎంత చక్కగా వేయాలో.. దాన్ని అంతే ఆసక్తికంగా విప్పాలి. ఈ సినిమాలో దర్శకుడు ముడి విప్పడంలో, ఆత్మహత్యల వెనుక ఉన్న మిస్టరీ రివీల్‌ చేయడంలో తడబడ్డాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బలాలు

+ సత్యదేవ్‌ నటన

+ ప్రథమార్ధం

బలహీనతలు

- కథలో పట్టు లేకపోవడం

- గాడితప్పిన స్క్రీన్‌ప్లే

- సంగీతం, పాటలు

చివరగా: లెక్క తప్పిన '47 రోజులు'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.