ETV Bharat / sitara

రివ్యూ: 'ఛపాక్'లో దీపిక ఎలా చేసిందంటే? - cinema reviews

బాలీవుడ్​లో రూపొందిన మరో బయోపిక్ 'ఛపాక్'. యాసిడ్ దాడి బాధితురాలిగా దీపిక పదుకొణె నటించింది. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

ఛపాక్ సినిమా రివ్యూ
ఛపాక్ సినిమాలో దీపిక పదుకొణె
author img

By

Published : Jan 10, 2020, 10:37 AM IST

Updated : Jan 10, 2020, 10:44 AM IST

చిత్రం: ఛపాక్‌
నటీనటులు: దీపిక పదుకొణె, విక్రాంత్‌ మస్సీ, మధురజీత్‌ సర్గి, అంకిత్‌ బిషత్‌ తదితరులు
సంగీతం: శంకర్‌-ఎహెషాన్‌-లాయ్‌
నిర్మాత: దీపిక పదుకొణె, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, గోవింద సింగ్‌ సంధు, మేఘనా గుల్జర్‌
దర్శకత్వం: మేఘనా గుల్జర్‌
విడుదల తేదీ: 10-01-2020

గత కొంతకాలంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. అగ్ర హీరోల నుంచి యువ కథానాయకుల వరకూ ఈ జోనర్‌లో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు హీరోయిన్లు అదే బాటలో వెళ్తున్నారు. ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలతో పాటు 'బాజీరావ్‌ మస్తానీ', 'పద్మావత్‌' లాంటి చారిత్రక కథా నేపథ్యమున్న చిత్రాల్లో నటించి మెప్పించింది దీపిక పదుకొణె. ఇప్పుడు యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'ఛపాక్‌'లో ప్రధాన పాత్ర పోషించింది. మేఘనా గుల్జర్‌ దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? యాసిడి దాడి బాధితురాలిగా దీపిక ఎలా నటించింది? తదితర విషయాలు తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.

deepika padukone in Chhapaak cinema
ఛపాక్ సినిమాలో దీపిక పదుకొణె

కథేంటంటే:

మాలతి(దీపికా పదుకొణె)కి అందరు అమ్మాయిల్లానే కొన్ని కలలు ఉంటాయి. జీవితంలో గాయని కావాలని అనుకుంటుంది. కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటూ ఉంటుంది. చదువుతో హాయిగా, ఆనందంగా సాగిపోతున్న ఆమెపై యాసిడ్‌ దాడి. అంతే, అప్పటి వరకూ ఆమె కన్న కలలు ఆవిరవుతాయి. ఫలితంగా మాలతి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. తీవ్ర నిరాశతో ఉన్న ఈమెకు అమోల్ (విక్రాంత్ మెస్సీ) అనే విలేకరి పరిచయమవుతాడు. అతడు అమోల్ అనే ఒక స్వచ్ఛంద నిర్వహిస్తుంటాడు. యాసిడ్ బాధితులకు చికిత్సనందిస్తూ, సాయం చేస్తుంటాడు. ఈ సంస్థలో చేరిన మాలతి.. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం ప్రారంభిస్తుంది. మాలతికి చేస్తున్న న్యాయ పోరాటంలో ఆమెకు ప్రజల నుంచి సహకారం లభిస్తుంది. తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో మాలతి వెల్లడిస్తుంది. అసలు మాలతిపై యాసిడ్‌ దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? మాలతి ఏవిధంగా న్యాయ పోరాటం చేసింది? చివరకు యాసిడ్‌ దాడి నుంచి కోలుకుని జీవితంలో విజయంవైపు ఎలా అడుగులు వేసిందన్నది తెరపై చూడాలి.

deepika padukone in Chhapaak cinema
ఛపాక్ సినిమాలో దీపిక పదుకొణె

ఎలా ఉందంటే:

ఇది ఓ బయోపిక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా మేఘనా గుల్జర్‌ తెరకెక్కించారు. ముఖ్యంగా మహిళా శక్తిని, స్ఫూర్తిని ఇతర మహిళల్లో నింపే ఉద్దేశంతో రూపొందించారు. దిల్లీ గ్యాంగ్‌ రేప్‌ను నిరసిస్తూ యువత ఆందోళన చేస్తున్న సీన్‌తో ఈ సినిమాను ప్రారంభమవుతుంది. దేశంలో మహిళల రక్షణను ప్రశ్నిస్తూ నెమ్మదిగా యాసిడ్‌ దాడి బాధితురాలి కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది దర్శకురాలు.. ఒక అందమైన అమ్మాయి.. అందమైన జీవితం.. అలాంటి అమ్మాయిపై యాసిడ్‌ దాడి జరిగితే ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. ప్రథమార్ధంలో యాసిడ్‌ దాడి, ఆ తర్వాత ఘటనలను వరుసగా చూపించిన దర్శకురాలు.. యాసిడి దాడులపై మాలతి చేసే పోరాటానికి ద్వితీయార్ధంలో పెద్దపీట వేశారు.

deepika padukone in Chhapaak cinema
ఛపాక్ సినిమాలో దీపిక పదుకొణె

యాసిడ్‌ దాడి తర్వాత ఆ బాధితులు ఎలాంటి నరకం అనుభవిస్తారు? సమాజంలో వాళ్లకు ఎదురయ్యే పరిస్థితులు.. ఇవన్నీ తెరపై చూస్తుంటే సగటు ప్రేక్షకుడికి కన్నీళ్లు ఆగవు. ఉద్యోగం కోసం మాలతి చేసే ప్రయత్నం అక్కడ ఎదురయ్యే అవమానాలు.. సమాజంలో తోటి వారి నుంచి ఎదురయ్యే ఈసడింపులు ఇవన్నీ భావోద్వేగాన్ని కలిగిస్తాయి. యాసిడ్‌ దాడికి గురైన బాధితులు ఎలా న్యాయం పొందాలి? న్యాయపరంగా ఎలా ముందుకు సాగాలన్న అంశాలను ఇందులో చక్కగా చూపించారు. అయితే, సన్నివేశాలన్నీ యాసిడ్‌దాడి, న్యాయ పోరాటం వీటి చుట్టూనే తిరగడంతో ద్వితీయార్ధంలో సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తాయి.

deepika padukone in Chhapaak cinema
ఛపాక్ సినిమాలో దీపిక పదుకొణె

ఎవరెలా చేశారంటే:

ఈ సినిమా మొత్తాన్ని దీపిక పదుకొణె తన భుజాలపై మోసింది. దీపిక అందానికి ఫిదా కాని అభిమానులు ఎవరూ లేరు. అలాంటి దీపికను యాసిడ్‌ దాడి బాధితురాలిగా తెరపై చూడటం సగటు అభిమాని జీర్ణించుకోలేడు. కానీ, దీపిక నటన ముందు అది పెద్ద విషయంగా అనిపించలేదు. ముఖ్యంగా దాడి అనంతరం తొలిసారి అద్దంలో తన ముఖం చూసుకునే సన్నివేశం మనతోనూ కన్నీళ్లు పెట్టిస్తుంది. దాడి జరిగినా, ఆత్మ విశ్వాసం చెదరని యువతి మాలతి పాత్రలో దీపిక జీవించింది. యాసిడ్‌ దాడి బాధితురాలిగా ఆమె మేకప్‌ కోసం ఎంత కష్టపడిందీ మనం తెరపై చూడవచ్చు. మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి వరకూ దీపికనే కనిపిస్తుంది. 'వాడు నా ముఖాన్ని మార్చేశాడు... నా మనసును మార్చలేదు' అన్న డైలాగ్‌ 'ఛపాక్' సినిమా పూర్తయ్యే వరకూ ప్రేక్షకుల హృదయాన్ని తాకుతూనే ఉంటుంది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు.

లక్ష్మీ అగర్వాల్‌ జీవితాన్ని ఆధారంగా సినిమాను తెరకెక్కించడంలో దర్శకురాలు మేఘనా గుల్జర్‌ సక్సెస్ అయ్యారు. ఏమాత్రం తేడా వచ్చిన సినిమా డ్యాకుమెంటరీ అయిపోయేది. అదే సమయంలో కమర్షియల్‌ హంగుల జోలికి పోలేదు. తాము చెప్పాలనుకున్నది 123 నిమిషాల్లో చెప్పేశారు. అయితే, కథనాన్ని పరుగులు పెట్టించలేకపోయారు. సాంకేతికంగా అన్ని విభాగాలు బాగా పనిచేశాయి. శంకర్‌-ఎహెసాన్‌-లాయ్‌ నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చింది. మాలే ప్రకాష్‌ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది.

laxmi agarwal
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్

బలాలు

  • దీపిక పదుకొణె
  • ఎమోషనల్‌ సన్నివేశాలు
  • సందేశం

బలహీనతలు

  • ద్వితీయార్ధం సాగదీత

చివరిగా: యాసిడ్‌ దాడులపై సందేశాన్ని ఇచ్చే 'ఛపాక్‌'!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: Wells Fargo Center, Philadelphia, Pennsylvania, USA. 9th January 2020.
Philadelphia 76ers 109, Boston Celtics 98
1st Quarter
1. 00:00 76ers and Celtics players before tipoff
2. 00:12 Celtics Kemba Walker makes 3-point shot, 8-7 Celtics trail
3. 00:24 Celtics Kemba Walker makes jump shot, 30-24 Celtics
4. 00;38 Replay of shot
4th Quarter
5. 00:47 76ers Al Horford assists Josh Richardson on dunk from inbounds pass, 88-85 76ers
6. 00:55 Replay of dunk
7. 01:02 76ers Furkan Korkmaz makes 3-point shot, 91-87 76ers
8. 01:19 76ers Ben Simmons makes hook shot, 103-94 76ers
9. 01:30 76ers Al Horford makes jump shot, 105-94 76ers
SOURCE: NBA Entertainment
DURATION: 01:46
STORYLINE:
Josh Richardson scored 29 points, Ben Simmons had 19 and the Philadelphia 76ers won without injured center Joel Embiid, beating the Boston Celtics 109-98 on Thursday night.
Embiid will have surgery Friday for a torn ligament in a finger in his left hand and will be evaluated in one to two weeks. Embiid, averaging 23.4 points and 12.3 rebounds in 31 games this season, tore the radial collateral ligament in the ring finger Monday night in a victory over Oklahoma City.
Mike Scott slid into the starting rotation, along with Al Horford, Tobias Harris, Richardson and Simmons. Simmons played center at times and drew a charge on Enes Kanter with 1:45 left in the first quarter.
With Embiid out indefinitely, even the deep reserves are going to have to contribute to keep them afloat until he returns. That included Furkan Korkmaz, who buried a 3 late in the fourth that stretched the Sixers' lead to 91-87. Horford, who left Boston in the offseason to sign a four-year deal with Philadelphia, converted a three-point play for a seven-point lead. The Celtics pulled within two, but the Sixers used a 9-0 run to put the game away and improve to 18-2 at home.
The 76ers have won all three games against the Celtics so far this season with one more to play in February.
Last Updated : Jan 10, 2020, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.