అమెరికన్ పాప్ సింగర్ జాన్ లెజెండ్.. పీపుల్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో 'సెక్సీయస్ట్ మ్యాన్ ఎలైవ్'గా నిలిచాడు. ఈ ఘనత తనకు దక్కడంపై ఆనందం ఉందని, కానీ కొంచెం భయం వేస్తోందని అన్నాడు.
"నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇదే సమయంలో కొంచెం భయంగానూ ఉంది. ఒత్తిడిగానూ ఫీలవుతున్నాను. ఎందుకంటే టైటిల్ తీసుకున్న తర్వాత అందరూ నన్నే గమనిస్తారు. నేను ఈ టైటిల్‌కు అర్హుడినా కాదా అని" -జాన్ లెజెండ్, గాయకుడు
ఇంతకు ముందు పీపుల్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్(2019)గానూ నిలిచాడు జాన్ లెజెండ్.
"జీసస్ క్రైస్ట్ సూపర్ స్టార్ లైవ్" కార్యక్రమానికిగానూ క్రియేటివ్ ఆర్ట్స్ విభాగంలో తన మొదటి ఎమ్మీని సంపాదించాడు లెజెండ్.
ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీ అవార్డులు సొంతం చేసుకున్న కొద్దిమందిలో ఈ గాయకుడు ఒకడు. ప్రస్తుతం "ది వాయిస్"లో కోచ్‌గా కనిపిస్తున్నాడు.