కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులు తమ వంతు ప్రచారాన్ని చేస్తున్నారు. అయితే ఈసారి వారికి భిన్నంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ.. వైద్యులు, పారిశుద్ధ్య కార్మికుల కష్టాల్ని వినూత్న రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నృత్యకారిణి దీపికారెడ్డి ఆమె కుమార్తె శ్లోకారెడ్డి. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
కరోనా మహమ్మారిపై సాగుతోన్న యుద్ధంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారని.. వారికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఈ వీడియోలో తెలిపారు. కరచాలనం నుంచి చేతులు శుభ్ర పరుచుకునే వరకు ప్రతి చర్యను వాక్యార్థ అభినయంతో వీక్షకులకు వివరించారు.
కరచాలనం వద్దంటూ.. 'నమస్తే' హద్దంటూ.. మీ ఆరోగ్యమే వారి భాగ్యమని నమ్మిన వైద్యులపై దాడులు చేయటం తగదంటూ.. 'వైద్యో నారాయణో హరిః' అనే మూలాన్ని తెలియజేశారు. వైద్యుల సూచనలు పాటించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అంకితభావంతో పనిచేసే వైద్య, పారిశుద్ధ్య, పోలీసుల ప్రాముఖ్యాన్ని చక్కగా వివరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నృత్య రూపకల్పన: దీపికా రెడ్డి
సంగీతం, గాయకుడు: దండిబొట్ల శ్రీనివాస వెంకట శాస్త్రి
గేయ రచన: వేదాంతం రామలింగ శాస్త్రి
నృత్యకారిణులు: దీపికా రెడ్డి, శ్లోకా రెడ్డి
ఇదీ చూడండి.. చిరంజీవి, నాగార్జునను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్