గతేడాది నెట్ఫ్లిక్స్లో 'లస్ట్ స్టోరీస్' చిత్రంతో ప్రేక్షకులను అలరించింది బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్. ఇప్పుడు ఈ సిరీస్కు కొనసాగింపుగా 'ఘోస్ట్ స్టోరీస్'ను తెరకెక్కించనుంది. ఇందులో జాన్వీ కపూర్, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. త్వరలో పట్టాలెక్కనుందీ సినిమా. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
జాన్వీ కపూర్.. జోయాతో మొదటి సారి పనిచేయబోతుంది. విజయ్ ఈ ఏడాది ఆమె దర్శకత్వంలో వచ్చిన 'గల్లీ బాయ్' చిత్రంలో కనిపించాడు. ఈ మూవీలో అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
జోయా, కరణ్ జోహర్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా 'లస్ట్ స్టోరీస్' చిత్రాన్ని రూపొందించారు. ఇంతకుముందు ఈ నలుగురు కలిసి 2013లో వచ్చిన 'బాంబే టాకీస్' సినిమాను తెరకెక్కించారు.
ఇది చదవండి: 'మోస్ట్ హ్యండ్సమ్ మ్యాన్'గా హృతిక్ రోషన్