ETV Bharat / sitara

త్వరలోనే 'జాంబిరెడ్డి' సీక్వెల్

తేజ సజ్జ హీరోగా వచ్చిన 'జాంబిరెడ్డి' మార్చి 26న ఆహాలో విడుదల చేయనున్నట్లు తెలిపారు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్​ వర్మ. ఈ సినిమాకు కొనసాగింపుగా 'జాంబిరెడ్డి 2' తెరకెక్కిస్తానని స్పష్టం చేశారు.

zombie reddy
జాంబిరెడ్డి
author img

By

Published : Mar 23, 2021, 8:29 PM IST

ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన 'జాంబిరెడ్డి' ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించింది. దానికి కొనసాగింపుగా 'జాంబిరెడ్డి 2' రాబోతోంది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌వర్మ స్వయంగా వెల్లడించారు. ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 26 నుంచి 'ఆహా'లో ప్రసారం కానుంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం విజయవాడలో సందడి చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ.. "చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవు అనే వాదన అబద్ధం. జాంబిరెడ్డిని 500 థియేటర్లలో విడుదల చేశాం. సినిమా రూ.15కోట్లు వసూలు చేసింది. జాంబిరెడ్డిని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. తేజకు హీరోగా తొలి సినిమాతోనే మంచి విజయం దక్కింది. థియేటర్‌లో చూడలేనివారికోసం ఓటీటీలో విడుదల చేస్తున్నాం. దీనికి కొనసాగింపుగా 'జాంబిరెడ్డి 2'ను త్వరలోనే తెరకెక్కిస్తాం" అని ప్రశాంత్‌వర్మ అన్నారు.

ఇదీ చూడండి: 'ఇన్నాళ్లు ఏం కోల్పోయానో తెలుసుకున్నా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.