ETV Bharat / sitara

హీరో విజయ్​ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

అగ్రకథానాయకుడు దళపతి విజయ్ ఇంట్లో బాంబు పెట్టానని ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అది ఫేక్ కాల్ అని గుర్తించారు.

vijay bomb threat call
హీరో విజయ్
author img

By

Published : Nov 17, 2021, 12:32 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్​ ఇంట్లో బాంబు పెట్టానంటూ బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని మరక్కణంకు చెందిన భువనేశ్వరన్​గా గుర్తించారు. అతడు గతంలో.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ సీఎం పళనిస్వామి, సూపర్​స్టార్​ రజనీకాంత్, హీరోలు కమల్​హాసన్, అజిత్​ ఇళ్లలో బాంబు పెట్టినట్లు బెదిరించాడని పోలీసులు తేల్చారు.

సోమవారం ఉదయం పోలీస్ కంట్రోల్​ రూమ్​కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. డాక్ స్క్వాడ్​తో విజయ్ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు ఏం లేకపోవడం వల్ల అది ఫేక్​ కాల్ అని గుర్తించారు.

ఆ తర్వాత విజయ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేశారు. చివరకు మరక్కణంకు చెందిన భువనేశ్వరన్​ అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.