బుల్లితెర ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. ఓ తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానల్ త్వరలోనే ప్రసారం చేయబోయే టాక్‌షోలో తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని సమాచారం. గతంలో ఎన్టీఆర్ ఓ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే.. మరోసారి మైక్ పట్టుకోబోతున్న ఎన్టీఆర్ ఈసారి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అదేంటీ.. టాలీవుడ్‌లో ఎంతో డిమాండ్ ఉన్న తారక్ రెమ్యూనరేషన్ లేకుండా పనిచేయడం ఏంటీ అనుకుంటున్నారా..?
అవును, ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. కాకపోతే.. తానే స్వయంగా డబ్బు పెట్టి నిర్మాత అవతారం ఎత్తనున్నారని సినీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నారు తారక్. అందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తవగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. అయితే.. ఈరెండు సినిమాలకు మధ్య దొరికిన ఖాళీ సమయాన్ని టాక్‌షోకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: బుల్లితెరపై మరోసారి వ్యాఖ్యాతగా తారక్?