యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'బాహుబలి' సిరీస్‌తో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయంగా, అంతర్జాతీయంగా భారీ ఫాలోయింగ్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. ఆ క్రేజే ఇప్పుడు ప్రభాస్‌కు సోషల్‌మీడియాలో మరో ఫాస్టెస్ట్ రికార్డును తెచ్చిపెట్టిందని ఆయన అభిమానులు అంటున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తర్వాత నుంచి ప్రభాస్ సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది కాలంలోనే 6 మిలియన్ల అనుచరులను ఆయన సొంతం చేసుకున్నారు. సోషల్‌మీడియాలో ఇదో వేగవంతమైన ఘనతగా ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు. డార్లింగ్ ఇటీవలే తన ఫేస్బుక్ ఖాతాలో 20 మిలియన్ల ఫాలోవర్స్‌ను సాధించారు.
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'రాధేశ్యామ్' చిత్రీకరణ తుది దశకు చేరుకోగా.. 'ఆదిపురుష్', నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాలు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
ఇదీ చూడండి: కిర్రాక్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్