ETV Bharat / sitara

నితిన్​.. నిఖిల్​ల పెళ్లి ఒకే రోజు..! - నితిన్ నిశ్చితార్థం ఫొటోలు

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పెళ్లి సీజన్ నడుస్తోంది. అప్పుడే వివాహం ఏంటని ప్రశ్నించే యువ హీరోలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కెందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరారు నితిన్​, నిఖిల్​. వీరిద్దరూ ఒకే రోజు మూడు ముళ్లు వేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.

young heros  Nithin and nikhil wedding, which was supposed to take place on April 16
నితిన్​ - నిఖిల్​లకు ఒకే రోజు..!
author img

By

Published : Feb 16, 2020, 4:41 PM IST

Updated : Mar 1, 2020, 1:01 PM IST

టాలీవుడ్ యువ కథానాయకులు నితిన్​, నిఖిల్​ ఒకే రోజు కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇద్దరు హీరోలు ప్రేమ వివాహాలే చేసుకోనున్నారు. నితిన్​ తన స్నేహితురాలు షాలినితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరు ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం కూడా జరుపుకొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​ వేదికగా పంచుకుంది ఈ యువ జంట. నితిన్​ - షాలిని వివాహం ఏప్రిల్‌ 16న జరగనుందని సమాచారం.

young-heros-nithin-and-nikhil-wedding-which-was-supposed-to-take-place-on-april-16
నితిన్​ - నిఖిల్​లకు ఒకే రోజు..!

అదే రోజు నిఖిల్‌ కూడా తన ప్రేయసి పల్లవితో ఏడడుగులు వేయనున్నాడు. ఇటీవలే తన డాక్టర్‌ ప్రేయసితో నిశ్చితార్థం జరుపుకొన్నాడు నిఖిల్​. ఏప్రిల్‌ 16నే ఆమెకు మూడు ముళ్లు వేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. వీరిలో నితిన్‌ వివాహం దుబాయ్‌లో జరగనుంది. ఇక నిఖిల్‌ వివాహ వేదికపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇదీ చదవండి: ఈ చిత్రాన్ని తీయడానికి కారణమదే: అరణ్య డైరెక్టర్​

Last Updated : Mar 1, 2020, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.