ETV Bharat / sitara

రామోజీ ఫిల్మ్ సిటీలో యువ హీరోల సందడి - కల్యాణ్ దేవ్ కిన్నెరసాని

తెలంగాణలో లాక్​డౌన్ ఎత్తివేయడం వల్ల టాలీవుడ్​లో షూటింగ్​లకు అనుమతి లభించినట్లయింది. ఈ నేపథ్యంలో రామోజీ ఫిల్మ్ సిటీలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణల సందడి కనిపిస్తోంది.

Young heros
యువ హీరోలు
author img

By

Published : Jul 3, 2021, 7:33 AM IST

రామోజీ ఫిల్మ్‌సిటీలో స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌.. అంటూ ఒకటే సందడిగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేయడం, తారలంతా షూటింగ్‌లకు సిద్ధమవుతుండటం వల్ల కొత్త సినిమాల చిత్రీకరణలు జోరుగా సాగుతున్నాయి. ఫిల్మ్‌సిటీలో ప్రముఖ హీరో సిద్ధార్థ్‌, యువ కథానాయకులు సత్యదేవ్‌, కల్యాణ్‌దేవ్‌ తమ సినిమాల చిత్రీకరణల్లో తలమునకలై ఉన్నారు. అన్ని కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. నటులు, సిబ్బంది ఎలాంటి ఇబ్బందుల్లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

పోరాడుతున్న సత్యదేవ్‌

యువ హీరో సత్యదేవ్‌ పోరాటాలు చేస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. సత్యదేవ్‌, కొంతమందిపై వెంకట్‌ మాస్టర్‌ నేతృత్వంలో రాత్రివేళ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నాగశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

satyadev
సత్యదేవ్

పబ్‌లో సిద్ధార్థ్

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'మహాసముద్రం'. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా వేసిన పబ్‌ సెట్‌లో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో సిద్ధార్థ్‌, రావు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

sidharth
సిద్దార్థ్

కోర్టులో కల్యాణ్‌ దేవ్‌

మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో కల్యాణ్‌ దేవ్‌. ఆయన హీరోగా రమణతేజ రూపొందిస్తున్న చిత్రం 'కిన్నెరసాని'. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌ సిటీలో తెరకెక్కిస్తున్నారు. కోర్టు నేపథ్యంగా సాగే సన్నివేశాలను కల్యాణ్‌దేవ్‌తో పాటు జూనియర్‌ ఆర్టిస్టులపై తీస్తున్నారు.

kalyan dev
కల్యాణ్ దేవ్

ఇవీ చూడండి: గూఢచారిగా కల్యాణ్​ రామ్.. కిషోర్​తో చైతూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.