ETV Bharat / sitara

అజిత్​ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ! - అజిత్​ వాలిమై

కోలీవుడ్​ అగ్రకథానాయకుడు అజిత్​ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న 'వాలిమై' చిత్రం ద్వారా తమిళంలో అడుగుపెట్టనున్నాడు టాలీవుడ్​ యంగ్​హీరో కార్తికేయ. ప్రస్తుతం చెన్నైలో కార్తికేయపై సన్నివేశాలు తెరకెక్కిస్తోంది చిత్రబృందం.

young hero Karthikeya resumes the shoot of Thala Ajith's Valimai
అజిత్​ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ
author img

By

Published : Sep 28, 2020, 8:07 AM IST

యువ కథానాయకుడు కార్తికేయ 'వాలిమై'తో తమిళంలోకి అడుగుపెట్టనున్నాడు. అజిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. లాక్‌డౌన్‌ కారణంగా మార్చిలో ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. కొన్ని రోజులుగా ఈ చిత్రంలోని కీలక యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారట. కార్తికేయపై తీస్తున్న ఈ సన్నివేశాలను చెన్నైలోని ఓ హైవేపై తెరకెక్కించారు. త్వరలోనే అజిత్‌ కూడా చిత్రీకరణలో పాల్గొననున్నట్టు చిత్రబృందం చెబుతోంది.

ఈ సినిమాకు సంబంధించి విదేశీ షెడ్యూల్‌ను ప్రస్తుతానికి వాయిదా వేశారట. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బోనీకపూర్‌ నిర్మాత. కార్తికేయ తెలుగులో 'చావు కబురు చల్లగా' చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.