బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి సినిమా చూడటం తనకు అంత సులభం కాదని నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పింది. అయితే ఈ చిత్రంలో అతడి నటన అద్భుతంగా ఉంటుందని, అది తనకు శాంతిని ఇస్తుందని తెలిపింది. వీరిద్దరూ 'డ్రైవ్'లో కలిసి నటించారు. సుశాంత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచెరా' ప్రమోషన్లో భాగంగా ఈ విషయాల్ని పంచుకుందీ ముద్దుగుమ్మ.
" class="align-text-top noRightClick twitterSection" data=""సుశాంత్ అకస్మాత్తుగా వెళ్లిపోవడం అందరికీ లోటే. ప్రజల కోసం ఎప్పుడూ ఉండాలని నాకు చెప్పేవాడు. గందరగోళం, ఒత్తిడికి గురైన సమయంలో నాకు సాయం చేసేందుకు అసలు వెనుకాడేవాడు కాదు. అయితే సుశాంత్ 'దిల్బెచారా' చూడటం నాకు అంత సులభం కాకపోవచ్చు" -జాక్వెలిన్ ఫెర్నాండెజ్, బాలీవుడ్ నటి
">